రాష్ట్రీయం

గీతం వర్శిటీ వీసీకి జాతీయ ఫెల్లోషిప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: గీతం డీమ్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణారావుకు న్యూఢిల్లీలోని జాతీయ తాత్విక పరిశోధనా మండలి (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫిలసాఫికల్ రీసెర్చి ) విశిష్ట సభ్యత్వం (నేషనల్ ఫెలోషిప్) ఇచ్చి సత్కరించింది. ప్రతిష్టాత్మకమైన ఈ సత్కారం పొందిన ఆయన ‘ ద భగవద్గీత- ఎ సైకాలజికల్ ప్రొఫైల్ ’ అనే అంశంపై రానున్న రెండేళ్లు అధ్యయనం చేయనున్నారు. పద్మశ్రీ ప్రొఫెసర్ కె రామకృష్ణారావు ప్రపంచ ప్రసిద్ధి చెందిన మనస్తత్వ వేత్త, తత్వవేత్త, విద్యావేత్త, గీతం వర్శిటీ ఛాన్సలర్‌గా , గీతం స్కూల్ ఆఫ్ గాంధీయన్ స్టడీస్ చైర్మన్‌గా సేవలు అందిస్తున్నారు. మనస్తత్వం, వేదాంతాల్లో విశేష పరిశోధనలు చేసిన రామకృష్ణారావు ఆంధ్రాయూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా, ఐసిపిఆర్ చైర్మన్‌గా, ఆంధ్రప్రదేశ్ విద్యా సలహాదారుగా సేవలు అందించారు. ఇంత వరకూ ఆయన 300 పరిశోధనా పత్రాలను ప్రచురించారు. 85వ ఏటలోనూ ఇనుమడించిన ఉత్సాహంతో తన పాండిత్యం, తాత్విక చతురత, లోతైన ఆలోచనలు, శ్రేష్టమైన నాయకత్వంతో విద్యా, సామాజిక పురోభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందిస్తున్నారు.