రాష్ట్రీయం

చర్చలు కంటి తుడుపే: ఎన్‌ఎంయూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 19: అపరిష్కృత సమస్యల పరిష్కారం పట్ల ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం సరైన రీతిలో స్పందించకపోవటంతో తిరిగి రెండో దశలో ఈనెల 29, 30 తేదీల్లో తిరిగి రాష్టవ్య్రాప్తంగా 128 డిపోలు, వర్క్‌షాపుల్లో రెండురోజులపాటు పెద్దఎత్తున రిలే నిరాహారదీక్షలు చేపట్టబోతున్నామని ఆర్టీసీ గుర్తింపుసంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు, చైర్మన్ ఆర్‌విఎస్‌డి ప్రసాద్, ముఖ్య ఉపాధ్యక్షుడు డి.సూర్యప్రకాశరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ పివి రమణారెడ్డి శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. తొలిదశలో ఈనెల 18, 19 తేదీల్లో జరిగిన ధర్నాలకు యాజమాన్యం స్పందించి ఈనెల 25తేదీ చర్చలకు ఆహ్వానించింది. అయితే ప్రధాన సమస్యల పట్ల సానుకూల స్పందన లేని కారణంగా తిరిగి రోడ్డెక్కాలని ఆర్టీసీ భవన్‌లో జరిగిన ఎన్‌ఎంయు రాష్ట్ర అత్యవసర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. 2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి రావాల్సిన పే స్కేల్స్‌ను వెంటనే అమలుచేయాలని, 60రోజుల సమైక్యాంధ్ర సమ్మె కాలాన్ని స్పెషల్ క్యాజువల్ లీవులుగా వర్తింప చేయాలని, 2013 పేస్కేల్స్ బకాయి బాండ్లకు నగదు చెల్లించాలని, అవుట్ సోర్సింగ్ రద్దుచేయాలని, అద్దె బస్సులకు ఫుల్‌స్టాప్ పెట్టి కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, గ్యారేజీలలో ఖాళీలను భర్తీ చేయాలని, మహిళా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు.