రాష్ట్రీయం

కిడ్నీ వ్యాధిగ్రస్థులకు బీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 19: ఉద్దానం కిడ్నీ బాధితులకు ఉచిత డయాలసిస్‌తో పాటు అవసరమయ్యే మందులను ఇక నుంచి ఉచితంగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కిడ్నీ బాధితులందరికీ ‘ఎన్టీఆర్ ఆరోగ్య రక్ష’ కింద ఉచిత బీమా సదుపాయం కల్పించాలని కలెక్టర్ల సదస్సు రెండోరోజు శుక్రవారం ముఖ్యమంత్రి చెప్పారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ బాధితులకు కూడా నెలకు రూ.2,500 పింఛన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో 8వేల మంది వరకు ఈ తరహా బాధితులు ఉన్నట్టు గుర్తించామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. పోషకాహార లోపం, రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న ఐదేళ్లలోపు శిశువులను సంపూర్ణ ఆరోగ్యం కల్పించేందుకు ఏడాదిలోపు లక్ష్యాలు సాధించేలా కార్యాచరణ చేపట్టాలని రెండోరోజు జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. ఏడాది తరువాత రాష్ట్రంలో రక్తహీనత, స్టెంటింగ్, పోషకాహార లోపం వంటి సమస్యలు ఆంధ్రప్రదేశ్‌లో కనిపించకుండా కార్యాచరణ ఉండాలన్నారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం అందజేత వంటివి మరింత విస్తరించాలని వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖలను ఆదేశించారు. సీమంతం, అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించి ఆ సమయంలోనే వారి బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయాలని చెప్పారు. అలాగే నూరుశాతం ఇమ్యూనైజేషన్ లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.సొంత భవనాల్లో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల సంఖ్య 33 శాతమే ఉందని, క్రమంగా అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాల్సి ఉందని ముఖ్యమంత్రి అన్నారు. అసంపూర్తిగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని 357 అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న అంగన్‌వాడీ భవనాల నిర్మాణం కోసం, ఒక్కోదానికి రూ.2లక్షల చొప్పున ప్రవాసాంధ్రుల నుంచి, లేదంటే ప్రభుత్వం నుంచి నిధులు సమకూర్చాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఆరోగ్యశాఖ-అంగన్‌వాడీ కేంద్రాలు, విద్యాశాఖ-అంగన్‌వాడీ కేంద్రాలు అనుసంధానం చేయాలని చెప్పారు.