రాష్ట్రీయం

లెర్నింగ్ సెంటర్‌ను ప్రారంభించిన డీజీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: రాష్ట్ర పోలీసు శాఖలో ఆవిష్కృతమవుతున్న నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అన్ని రకాల సేవలకు అవసరమైన శిక్షణ అందించేందుకు లెర్నింగ్ సెంటర్‌ను డిజిపి ఎం.మహేందర్‌రెడ్డి ప్రారంభించారు.
రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో కమ్యూనికేషన్స్ విభాగంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ద్వారా శిక్షణ అందించనున్నారు. ఈ ప్రారంభోత్సవంలో డిజిపితో పాటు శాంతిభద్రతల అదనపు డిజి అంజనీకుమార్, అదనపు డిజి సిఐడి గోవింద్‌సింగ్, టెక్నికల్ సర్వీసెస్ అదనపు డిజి రవిగుప్తా, మరో అదనపు డిజి సౌమ్యామిశ్రా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి మల్లారెడ్డి, సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు. సాంకేతిక సేవలే కాకుండా జిల్లాల్లో, లేదా ఇతర పోలీసు యూనిట్లలో చేపట్టిన సేవలు ప్రజామోదంగా ఉండి, పోలీసు శాఖకు పేరు తెచ్చే విధంగా ఉంటే అటువాటి గురించి కూడా ఈ సెంటర్‌లో మిగిలిన వారికి అవసరమైన శిక్షణ ఇస్తారు. ఈ లెర్నింగ్ సెంటర్‌ను అన్ని రకాల సేవలను అం దుబాటులో ఉంచేందుకు ఏర్పాటు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. తాజాగా టిఎస్‌కాప్ వంటి యాప్ ఆధారిత సేవలకు అవసరమైన శిక్షణ కూడా ఈ లెర్నింగ్ సెంటర్ ద్వారా అందిస్తారని తెలిపారు.

చిత్రం..తెలంగాణ లెర్నింగ్ సెంటర్‌ను ప్రారంభించిన డీజీపీ మహేందర్‌రెడ్డి