రాష్ట్రీయం

ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరాటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరాటాలు ఉధృతం చేయాలని టి.టిడిపి సమావేశం నిర్ణయిచింది. శనివారం ఎన్టీఆర్ భవన్‌లో టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ అధ్యక్షతన పార్టీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సమావేశాలు జరిగాయి. అనంతతరం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ 22వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల 18న పల్లె పల్లెకూ తెలుగు దేశం పేరిట కార్యక్రమాన్ని 119 నియోజకవర్గాల్లో ప్రారంభించినట్లు చెప్పారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన మార్చి 29వ తేదీ వరకు అంటే 70 రోజుల పాటు ఈ కార్యక్రమం ద్వారా అన్ని పల్లెల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఇంటింటికీ వెళతారని ఆయన చెప్పారు. దీంతో పాటు ప్రజా సమస్యలపై ప్రభుత్వ అధికారులను, పాలకులను ఎక్కడికక్కడ తమ కార్యకర్తలు నిలదీస్తారని ఆయన తెలిపారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులును కూడా ఆహ్వానించామని, అయితే ఆయన సోదరుడు మరణించినందున ఊరు వెళ్ళారని రావుల చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ ఎంపి గరికపాట మోహన్ రావు, ఇతర నాయకులు కొత్తకోట దయాకర్ రెడ్డి, బుచ్చిలింగం, చాడ సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నేతలతో మాట్లాడుతున్న టీడీపీ పార్టీ అధ్యక్షుడు రమణ