రాష్ట్రీయం

ఇళ్లన్నీ మీకేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 20: తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ నేతలపై మిత్రపక్షమైన బీజేపీ నేతలు మరోసారి ధ్వజమెత్తుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన గృహ నిర్మాణాల కేటాయింపులో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోనే ఈ తంతు సాగుతోందని కమలనాథులు కనె్నర్ర చేస్తున్నారు. ఇటీవల కాకినాడలో పట్టుబడిన ఇడిబుల్ ఆయిల్ మాఫియాకు తెలుగుదేశం నేతలతో ఉన్న సంబంధాలకు నిరసనగా బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని, మాఫియాను నడిపిస్తున్న ఓ టీడీపీ నాయకుడిని కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కూడా చేపట్టారు. దీంతో మాఫియాపై సమగ్ర విచారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. తాజాగా గృహ నిర్మాణంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని కమలనాథులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జిల్లా కేంద్రం కాకినాడ నగరానికి సుమారు 10వేల గృహాలను మంజూరు చేసింది. అయితే గృహాల కేటాయింపు మాత్రం స్థానిక ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో జరుగుతోందని, అది కూడా అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. పేదలకు గృహాల కేటాయింపులో అనేక రకాలుగా టీడీపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలు అర్హులైన లబ్ధిదారులకు అందకుండా దళారులకు అందే విధంగా టీడీపీ నేతలు ప్రోత్సహిస్తున్నారని, ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తమవద్దున్నాయని ఆయన స్పష్టం చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్టు ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలకు ఆన్‌లైన్‌లో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో వెల్లడించడంతోపాటు లబ్ధిదారుల పూర్తి వివరాలను వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా కాకినాడ నగరంలో గృహాల కేటాయింపులో అనేక అక్రమాలు జరుగుతున్నట్టు గతంలోనే ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపించారు.
గృహాలకు ఆన్‌లైన్ విధానంలో అర్హత పొంది, ప్రభుత్వం నిర్దేశించిన రుసుం చెల్లించిన వారికి కాకుండా దొడ్డిదారిలో దరఖాస్తు చేసుకున్న వారిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు గృహ బినామీ లబ్ధిదారుల ఎంపిక జరిగిందని, అది కూడా పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మారాయంటూ ప్రజాసంఘాలు సైతం ఆందోళన నిర్వహించాయి. దొడ్డిదారిలో జరుగుతున్న గృహాల కేటాయింపులో స్థానిక నేతలు కోట్ల రూపాయలను బ్రోకర్ల ద్వారా వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. వీటన్నిటిపైనా సమగ్ర విచారణ చేపట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి నేరుగా విన్నవించనున్నట్టు బీజేపీ నేతలు చెప్పారు.