రాష్ట్రీయం

ఇక కొండగట్టునుంచి యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ సత్తా చాటుకునేందుకు జనసేన పార్టీ చాప కింద నీరులా సమాయాత్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల బరిలోకి దిగేందుకు నియోజకవర్గాల వారీ కసరత్తు ప్రారంభించిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వివిధ విభాగాలకు తాత్కాలిక కమిటీలను నియమించడంతో పాటు యువతపై దృష్టిసారించారు. రోజూ వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారితో సమీక్షిస్తూ మరో పక్క కార్యకర్తలను చైతన్యపరుస్తూ బిజీగా గడుపుతున్న పవన్‌కళ్యాణ్ రెం డు రాష్ట్రాల్లో జనసేన భవితవ్యంపై ఒక ప్రకటన చేయనున్నట్టు తెలిపారు.
రెండు రాష్ట్రాల్లో రాజకీయ యాత్ర త్వరలో ప్రారంభిస్తామని, ఈ యాత్రను జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుండి ప్రారంభించనున్నట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు. 2009లో ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో సంభవించిన పెను ప్రమాదం నుండి తాను ఇక్కడే బయటపడటం తన కుటుంబ ఇలవేల్పు ఆంజనేయస్వామి కావడంతో తన రాజకీయ అప్రతిహత యాత్రను కూడా కొండగట్టు నుండే ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు. సర్వమత ప్రార్ధనల అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సులు కోసం తాను బయలుదేరుతానని, ప్రజాసమస్యలను అధ్యయనం చేసి వాటిని అవగాహన చేసుకునేందుకు ఈయాత్ర ద్వారా వస్తున్న తనను ఆశీర్వదించాలని పవన్ కళ్యాణ్ కోరారు. తన రాజకీయ యాత్ర వివరాలను, ప్రణాళికలను కొండగట్టులోనే ప్రకటిస్తామని కూడా ఆయన వివరించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లోనూ, ఫేస్‌బుక్‌లోనూ ప్రకటనలు చేశారు. ఈ ట్వీట్‌తో పాటు పవన్ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ ఫొటోను కూడా పోస్టు చేశారు. రెండు రాష్ట్రాల్లో పాదయాత్ర చేయాలని ఫ్యాన్స్ కోరుతుండగా, సైకిల్ యాత్ర చేయాలని మరికొందరు కోరుతున్నారు. మొత్తం మీద అన్ని నియోజకవర్గాలను కలిసి తిరిగేలా పవన్ యాత్రను రూపొందిస్తున్నట్టు సమాచారం.
పోలాండ్ అంబాసిడర్‌తో భేటీ
పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీతో పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు భేటీ కానున్నారు. జనసేన పార్టీకి బురాకోవస్కీ వస్తారని జనసేన నేతలు చెప్పారు. గత నవంబర్‌లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినపుడు ఆయనను కొందరు పోలెండ్ వాసులు కలుసుకున్నారు. కళ్యాణ్ గురించి తెలుసుకున్న బురాకోవస్కీ హైదరాబాద్ వస్తున్నారు. అంబాసిడార్‌తో పాటు 20 మంది పోలాండ్ ప్రతినిధులు కూడా పవన్‌ను కలువనున్నారు.