రాష్ట్రీయం

రైతన్నకు అండగా ఉంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 20: ‘రైతన్నకు అండగా ఉంటా.. వ్యవసాయానికి గిట్టుబాటు ధర కల్పిస్తా.. రైతు కూలీలను ఆదుకుంటా’నని ప్రతిపక్ష నేత, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా శనివారం ఉదయం 8గంటలకు చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం కుక్కలవారి కండ్రిగ గ్రామం నుంచి పాదయాత్ర మొదలైంది. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాగానే ఎమ్మేల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఎంపీలు వరప్రసాద్, మిధున్‌రెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గం సమన్వయకర్త బియ్యపు మధుసూధన్‌రెడ్డితో కలసి మాట్లాడారు. అనంతరం వెంకటాపురం క్రాస్, కుమ్మరమిట్ట, మోదుగులపాళెం క్రాస్, కొత్తవీరాపురం, కోబాక, ఏర్పేడు, మేర్లపాక, చిందేపల్లి క్రాస్ రోడ్డు మీదుగా శ్రీకాహస్తి వైపు యాత్ర ప్రారంభించారు. కొత్తవీరాపురం చేరుకోగానే ఎదురొచ్చిన మహిళలను ఆప్యాయంగా
పలకరించారు. పక్కనే వరి పొలంలో కలుపుతీస్తున్న మహిళలతో కలిసి కాసేపు కలుపుతీస్తూ వారి సాదకబాధకాలను తెసుకున్నారు. మాకోసం వందల మైళ్లు నడిచొచ్చావన్నా, మీ ప్రేమానురాగాలు మరిచిపోమన్నా, మీ తండ్రి పాలనలో మాకెంతో మేలు జరిగిందన్నా, నువ్వు కూడా మమ్మల్ని అలాగే చూసుకుంటావని నమ్మకముందన్నా, నీరాకతో ఈరోజు మాకు పండగేనన్నా.. అంటూ మురిసిపోయారు. అనంతరం కోబాగ గ్రామం వద్ద చెరువులో చేపలు పడుతున్న యానాదుల వద్దకు వెళ్లి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. శ్రమకు తగ్గ ఫలితం లభించడం లేదని, ఒక పూట తిని మరోపూట పస్తులు ఉంటున్నామని, అంతేకాకుండా, కాస్తో కూస్తో వచ్చిన సొమ్ముతో తమ భర్తలు మద్యానికి బానిసలవుతున్నారని మహిళలు ఆయనకు విన్నవించారు. దీంతో ఆయన స్పందిస్తూ మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో నాకు అర్థమైందని.. నన్ను మీరంతా ఆదరించండి మీకు అండగా ఉంటానంటూ వారి దీవెనలు తీసుకున్నారు. అనంతరం ఏర్పేడు బస్టాండు ఆవరణలో వైకాపా రాష్ట్ర యువత కార్యదర్శి కన్నలి మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో 206 మందితో నిర్వహించిన నేత్రదానం శిబిరంలో పాల్గొన్నారు. తదనంతరం మేర్లపాక దళితవాడలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కోటేశ్వర్‌రావు, రమణయ్యయాదవ్, నాగార్జునరెడ్డి, అర్జున్‌బాబు, మునిరత్నంరెడ్డి, కన్నలి లోకనాధరెడ్డి, భాస్కర్‌రెడ్డి, రాజారెడ్డి పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.