రాష్ట్రీయం

కాళేశ్వరం ఓ అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జనవరి 20: కోటి ఎకరాల మాగాణిగా మార్చాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ‘న భూతో న భవిష్యత్’ అన్న మాదిరిగా కొనసాగుతున్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టు మహా అద్భుతమని రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ కొనియాడారు. ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో సాగు, తాగు నీటికి ఢోకా ఉండదని తెలిపారు. శనివారం రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి గవర్నర్
దంపతులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హెలికాప్టర్ ద్వారా సుడిగాలి పర్యటన చేశారు. కాళేశ్వరం (మేడిగడ్డ) ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం పెద్దపల్లి జిల్లాలోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీ పనులను పరిశీలించారు. ఇక్కడి నుంచి ధర్మారం మండలం మేడారం టనె్నల్ పనులు పరిశీలించి, చివరగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ టనె్నల్, సబ్ స్టేషన్లు, సర్జ్‌పూల్ పనులను పరిశీలించారు. లక్ష్మీపూర్‌లో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రెండేళ్ల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పవర్ ప్రజంటేషన్ ఇచ్చారని, అది చూసి ఆయనను కలల చంద్రశేఖర్‌రావుగా అనుకున్నానని, కానీ నేడు ప్రాజెక్టును పరిశీలించానని, కాళేశ్వరం నిజంగా గొప్ప ప్రాజెక్టు అని అన్నారు. ఇప్పటినుంచి సీఏం కేసీఆర్‌ను కాళేశ్వరం చంద్రశేఖర్‌రావుగా పిలవాలని ఉందని, అలాగే పిలుస్తానంటూ ప్రశంసల జల్లు కురిపించారు. అలాగే నిద్రలో కూడా కాళేశ్వరం అని కలవరించే మంత్రి హరీశ్‌రావును కాళేశ్వర్‌రావుగా, ప్రిన్సిపల్ సెక్రటరీ జోషీ అనే అధికారి జోష్‌గా పనిచేస్తున్నాడని, ఇలా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనులు చేస్తున్నారని ప్రశంసించారు. అటు కార్మికులు, కాంట్రాక్టర్లతో కూడా మాట్లాడానని, వారు తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారని చెప్పారు. ప్రాజెక్టు వెనుక ఒక పెద్ద టీమ్ వర్క్ ఉందని అన్నారు. లక్ష్మీపూర్ ప్యాకేజీ-8లో నిర్మిస్తున్న అండర్ టనె్నల్, సర్జ్‌పూల్ పనులు చాలా కష్టతరంతో కూడుకుని ఉన్నాయని, అయినా, నిత్యం పనులు జరుగుతున్న ఇక్కడ ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని వౌలిక వసతులను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఇక్కడ గోదావరిని అంతర్‌వాహినిగా తీసుకొచ్చారని, కాళేశ్వరం పనుల్లో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. ఆ ముక్తినాథ్ ఆశీస్సులతో మరో ఆరు మాసాల్లో ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు ఈరోజు సంతోషమైన దినంగా భావిస్తున్నానని గవర్నర్ వెల్లడించారు. ఆయన వెంట గవర్నర్ సతీమణి, రాష్ట్ర బేవరేజేస్ చైర్మన్ దేవీప్రసాద్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులు, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, సీపీ కమలాసన్‌రెడ్డి, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డిలతోపాటు పలువురు పాల్గొన్నారు.

చిత్రాలు..ప్రాజెక్టుల పరిశీలనకు వచ్చిన గవర్నర్ నరసింహన్‌కు జ్ఞాపికను అందిస్తున్న హరీశ్‌రావు. *లక్ష్మీపూర్‌లో పనులను పరిశీలిస్తున్న గవర్నర్ దంపతులు