రాష్ట్రీయం

మూడు వారాల్లోనే తేల్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: రాష్ట్ర రాజధానిలో భవనాల నిర్మాణానికి అనుమతి ఇచ్చే గడువును 30 రోజుల నుండి 21 రోజులకు తగ్గించారు. ఈ మేరకు పురపాలక వ్యవహారాలు, పట్టణాభివృద్ధి ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ పేరుతో శనివారం ఉత్తర్వులు (జీఓ) జారీ అయ్యాయి. భవనాల నిర్మాణానికి సంబంధించి అనుమతి ఇవ్వడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోందని సంబంధిత మంత్రి కె. తారకరామారావు ఒక సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. భవనాల అనుమతిని వేగంగా కొనసాగించాలని మంత్రి ఆదేశించారు. దాంతో సంబంధిత అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. భవన నిర్మాణానికి ఇప్పటివరకు అనుమతి ఇచ్చే గడువు 30 రోజులుగా ఉంది. ప్రజలు ఎవరైన దరఖాస్తు చేస్తే భవన నిర్మాణానికి 30 రోజుల గడువు ఎందుకని, దీన్ని తగ్గించాలని కెటిఆర్ చేసిన సూచనకు అనుగుణంగా ఈ గడువును 21 రోజులకు
తగ్గించారు. భవన నిర్మాణానికి సంబంధించి దరఖాస్తులను ప్రజలు ఆన్‌లైన్‌లో పంపించాలి. ప్రజల నుండి భవననిర్మాణానికి దరఖాస్తు రాగానే వాటిని సంబంధిత అధికారులు పరిశీలించాలని జీఓలో సూచించారు. దరఖాస్తు దారుని నుండి అదనంగా ఏవైనా డాక్యుమెంట్లు, సమాచారం కావాలని భావిస్తే అందుకు పదిరోజుల గడువుగా నిర్ణయించారు. ఆ తర్వాత ఇన్‌స్పెక్టింగ్ అధికారి లేక స్క్రూటినీ అధికారి ఏడు రోజుల్లోగా ఇన్‌స్పెక్షన్ చేయాలని సూచించారు. అంటే దరఖాస్తు దారుడు దరఖాస్తు చేసిన 20 రోజుల్లోగా సమాచారం సేకరించడం, ఇన్‌స్పెక్షన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ మరురోజు అంటే 21 వ రోజు అనుమతి ఇవ్వాలని జీఓలో పేర్కొన్నారు. అయితే అప్రూవ్డ్ లేఅవుట్ లేదా రెగ్యులరైజ్డ్ లేఅవుట్‌లో భవన నిర్మాణ స్థలం ఉంటే ఇన్‌స్పెక్షన్ కూడా చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. హెచ్‌ఎండిఎ మరియు జిహెచ్‌ఎంసికి చెందిన ల్యాండ్ సెక్షన్, రెవెన్యూ సెక్షన్ ఓనర్‌షిప్ డాక్యుమెంట్ల భూపరిశీలనను ఏడురోజుల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా అనుమతులకు సంబంధించిన పనులు పూర్తి చేయకపోతే, సంబంధిత సిబ్బందిపై రోజుకు 1000 రూపాయల జరిమానా (పెనాల్టీ) విధిస్తామని స్పష్టం చేశారు.
లైసెన్స్‌డ్ ఆర్కిటెక్ట్‌లు, ఇంజనీర్లు, సర్వేయర్లు మూడు సార్ల వరకు తప్పుడు సమాచారం, తప్పుడు ప్లాన్లను ఇస్తే వారి లైసెన్స్ రద్దు చేయాలని జీఓలో అరవింద్ కుమార్ పేర్కొన్నారు.