రాష్ట్రీయం

కోర్టు ధిక్కారంపై ద.మ.రైల్వే జీఎంకు హైకోర్టు బెయిలబుల్ వారెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: ఒక కేసులో కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు గాను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వికె యాదవ్‌కు హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రతాప్ అనే వ్యక్తి దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటీషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సురేష్‌కుమార్ కైట్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన బెంచ్ శనివారం విచారణ చేపట్టింది. అనంతరం ఈ నెల 25లోగా తమ ముందు హాజరు పర్చాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. కారుణ్య నియామకానికి సంబంధించి తన వాదనను వినకుండా రైల్వే పట్టించుకోవడం లేదని హైకోర్టులో ప్రతాప్ పిటీషన్ దాఖలు చేశారు.
తొలుత సర్వీస్‌లో ఉండగా మృతి చెందిన ఉద్యోగికి రెండవ భార్య ఉండి, ఆమె సంతానానికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వలేమని 1992లో జారీ చేసిన సర్క్యులర్‌ను ఆధారం చేసుకుని ప్రతాప్ విజ్ఞప్తిని రైల్వే నిరాకరించింది. దీంతో కేంద్ర పరిపాలన ట్రడిబ్యునల్‌ను ఆశ్రయించగా, ప్రతాప్ వాదనను విని ఉద్యోగం ఇవ్వాలని రైల్వేని ఆదేశించింది. రైల్వే జారీ చేసిన సర్క్యులర్‌ను కోల్‌కత్తా హైకోర్టు గతంలో నిలిపివేసిందని, ఈ దశలో ఇక అప్పీలుకు అవకాశం లేదని తేల్చి చెప్పింది. ఈ నేపధ్యంలో రైల్వే అతనికి ఉద్యోగం ఇవ్వకపోతే హైకోర్టుకు వెళ్లవచ్చని కూడా స్పష్టం చేస్తూ, పిటీషనర్‌కు 8 వారాల్లోగా ఉద్యోగం ఇవ్వాలని రైల్వేను క్యాట్ ఆదేశించింది. ఈ ఆదేశాలను ద.మ.రైల్వే అధికారులు అమలు చేయడంలో విఫలం కావడంతో బాధితుడు రైల్వేపై కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేశారు. దీంతో ఈ నెల 19న హాజరు కావాలని హైకోర్టు జనరల్ మేనేజర్‌ను ఆదేశించింది. అయితే జనరల్ మేనేజర్ హైకోర్టుకు హాజరు కాకపోవడంతో శనివారం బెయిలబుల్ వారెంట్ జారీ చేసి ఈ నెల 25లోగా తమ ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.