రాష్ట్రీయం

ఏసీబీ వలలో ఇరిగేషన్ డీఈ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్సువాడ రూరల్, జనవరి 20: కామారెడ్డి జిల్లాలోని బాన్స్‌వాడ డివిజన్ కేంద్రంలో శనివారం ఏసీబీ అధికారుల గాలానికి భారీ అవినీతి చేప చిక్కింది. చాకచక్యంగా వ్యవహరించిన ఏసీబీ అధికారులకు భారీ నీటిపారుదల శాఖలో బాన్సువాడ డిప్యూటీ ఇఇగా విధులు నిర్వహిస్తున్న శ్రావణ్‌కుమార్ అక్రమ ఆస్తులను గడించినట్టు గుర్తించామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం నీటిపారుదల శాఖ డిప్యూటీ ఇఇకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ, కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, మెదక్, కరీంనగర్, మేడ్చల్, అల్వాల్ ప్రాంతాలలో లెక్కకు మించి ఆస్తులున్నట్టు ఏసీబీ అధికారులు ఏకకాలంలో జరిపిన దాడుల్లో కనుగొన్నట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు. అధికారి ఇంటితో పాటు బంధువుల ఇళ్లల్లో కూడా సోదాలు చేశారు. ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు అర్జించాడని నిజామాబాద్ ఏసీబీ రేంజ్ కార్యాలయంలో ఫిర్యాదు అందడంతో శనివారం అధికారులు రంగంలోకి దిగారు. బాన్సువాడలోని శ్రావణ్‌కుమార్ అద్దెకు ఉంటున్న ఇంటిలో తనిఖీలు చేపట్టారు. నవీపేట్ మండలం కోస్లీ గ్రామ శివారులోని 33 లక్షల విలువ చేసే రిజిస్ట్రేషన్ పత్రాలను కనుగొన్నారు. 35వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. శ్రావణ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. శ్రావణ్‌కుమార్‌పై ఇటీవల తమకు ఫిర్యాదు అందిందని, ఆదాయానికి మించి సదరు అధికారికి అక్రమ ఆస్తులున్నట్లు పిర్యాదులో పేర్కొన్నట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు ఏసీబీ శాఖ ఆధ్వర్యంలో ఏకకాలంలో శ్రావణ్‌కుమార్ ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో, ఆర్మూర్ పట్టణంలోని తండ్రి రఘుపతి రెడ్డి నివస్తున్న ఇంట్లో సోదాలు చేశారు. ఇప్పటివరకు కోటి 75 లక్షల ఆస్తులతో పాటు 34 ఎకరాల వ్యవసాయ భూమి, జీడిమెట్ల, బేగంపేట్ ప్రాంతాలలో ఖాళీస్థలాలు, రెండు కమర్షియల్ భవనాలతో పాటు మరో ఇల్లు కనుగొన్నట్టు వివరించారు.