రాష్ట్రీయం

టీచర్ల ఎంపికకు పరీక్షల షెడ్యూల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: టీచర్ల ఎంపికకు పబ్లిక్ సర్వీసు కమిషన్ సన్నాహాలు చేస్తోంది. టిఆర్‌టి పరీక్ష కేంద్రాల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారులకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు కోరారు. పరీక్ష కేంద్రాల జాబితాను పంపించాలని ఇప్పటికే పబ్లిక్ సర్వీసు కమిషన్ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడ్ని కోరింది. ఫిబ్రవరిలో రిక్రూట్‌మెంట్ నిర్వహించి, వీలైనంత తొందరలో ఫలితాలను ప్రకటించాలని కమిషన్ యోచిస్తోంది. పరీక్షలు వాయిదా పడతాయనే ప్రచారం కొంత మంది చేస్తున్నారని, అలాంటి యోచన లేదని కూడా అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుత షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 27న ఎస్‌జిటి ఎంపిక పరీక్ష, 25న లాంగ్వేజి పండిట్స్, 26న స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజి పండిట్లు, 27న స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజిలు, 28న పిఇటి ఎంపిక పరీక్ష జరుగుతాయి.