రాష్ట్రీయం

‘పవన్’కు కొండగట్టులో స్థానం లేదు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జనవరి 21: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకించిన జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌కు తెలంగాణ ప్రజల సెంటిమెంట్ అయిన కొండగట్టు ఆలయంలో స్థానం లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ప్రజల సెంటిమెంటుకు వ్యతిరేకంగా వ్యవహరించిన పవన్‌కు ఇలాంటి అవకాశం ఇవ్వవద్దని డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం కరీంనగర్‌లోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2009 ఎన్నికల్లో జరిగిన ప్రమాదానికి ప్రాయశ్చిత్తంగా కొండగట్టుకు వస్తానంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. భక్తులతో కిటకిటలాడుతున్న కొండగట్టు దేవస్థానానికి పవన్ వస్తే ఆ భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. తెలంగాణకు అన్నివిధాల సహకరించిన మాజీ లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ వస్తే పలు పోలీసు ఆంక్షలతో అడ్డుకున్న కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను పూర్తిగా వ్యతిరేకించిన పవన్ విషయంలో ఏ విధంగా స్పందిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను దారి మళ్లించేందుకే పవన్‌కల్యాణ్‌తో కేసీఆర్ జతకట్టారని ఆరోపించారు. తెలంగాణ విషయంలో కెసీఆర్‌ను తాట తీస్తా, తోలు తీస్తానన్న పవన్‌తో ఏ విధంగా జత కడతారని కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. ఆయనను తెలంగాణలో, ప్రధానంగా కొండగట్టుకు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ఆంధ్రాలో ఏపి విభజన విషయంలో జరుగుతున్న అన్యాయాలపైన, వైజాగ్‌లో దళిత మహిళపై జరిగిన ఆకృత్యంపైన స్పందించిన పవన్ తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలు, ఘటనలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
నేరెళ్లలో దళితులపై అరాచకత్వం ఘటన దేశాన్ని కదిలించినా నిన్ను కదిలించలేదా పవన్ అంటూ మండిపడ్డారు. ఈ విషయంలో పవన్ సమాధానం చెప్పాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఆకుల ప్రకాష్, కర్ర రాజశేఖర్, ఒంటెల రత్నాకర్, దిండిగాల మధు, అజిత్ రావు తదితరులు పాల్గొన్నారు.