రాష్ట్రీయం

కొండగట్టు.. రాజకీయ మెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ తన రాజకీయ యాత్రను కరీంనగర్ జిల్లా కొండగట్టు నుంచి ప్రారంభించేందుకు ఆదివారం రాత్రి షెడ్యూల్‌ను ఖరారు చేశారు. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత జిల్లాల వారీగా తిరిగి తన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజలకు తెలియజేసి, ఆయా స్ధానిక సమస్యలపై స్పందించేందుకు వీలుగా తన యాత్రను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా నిశ్శబ్ధంగా ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయంగా మరో అడుగు ముందుకు వేశారు. కరీంనగర్ జిల్లా కొండగట్టు వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచే రాజకీయ యాత్ర చేపట్టేందుకు నిర్ణయించారు. ఆంజనేయస్వామి తమ ఇంటి ఇలవేల్పు అయినందున కొండగట్టు నుంచి ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు పవన్‌కళ్యాణ్ వెల్లడించారు. దీనిలో భాగంగా ఆదివారం రాత్రి తెలంగాణలో తన పర్యటనను ఖరారు చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటలకు కొండగట్టుకు చేరుకుంటారు. అక్కడ హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం రాత్రికి కరీంనగర్ చేరుకుంటారు. 23వ తేదీ ఉదయం కరీంనగర్, నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటిస్తారు. ఆ తర్వాత 24వ తేదీ ఉదయం కొత్తగూడెం చేరుకుని అక్కడ ప్రజలతో మాట్లాడతారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోని కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. ఈ రాజకీయ యాత్ర ద్వారా ప్రజా సమస్యలను తన అభిమానులు, పార్టీ నాయకుల ద్వారా తెలుసుకుని భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేందుకు పవన్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కేవలం ప్రజా సమస్యల అధ్యయనం కోసమే యాత్ర చేస్తున్నామని చెబుతున్నా, పాదయాత్రలో ఎక్కువ మందిని కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
సెయింట్ థెరిస్సా బసిలికా చర్చిలో
పవన్ దంపతుల ప్రార్ధనలు
సికింద్రాబాద్‌లోని సెయింట్ థెరిస్సా బసిలికా చర్చిలో పవన్‌కళ్యాణ్, ఆయన భార్య అన్నా పవన్‌కళ్యాణ్‌తో ఆదివారం ప్రార్ధనలు నిర్వహించారు. వీరితో పాటు పోలాండ్ నుంచి వచ్చిన రాయబారి ఆడమ్ బురాకోవస్కీకూడా పాల్గొన్నారు. భారతీయ జీవనశైలి, విద్యావిధానాన్ని అధ్యయనం చేసేందుకు వచ్చిన పోలెండ్ విద్యార్థి బృందం కూడా చర్చిలో ప్రార్ధనలకు విచ్చేశారు. చర్చిలో వీరికి
ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ దంపతులు, వీరి కుమారుడు మార్క్, రాయబారి ఆడమ్‌లకు చర్చి ఫాదర్ బాలశౌరి దీవెనలు అందజేశారు. దాదాపు గంటన్నర సేపు వీరంతా చర్చిలోనే గడిపారు. తొలుత జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చిన రాయబారి ఆడమ్, ఆయనతో పాటు వచ్చిన విద్యార్థి బృందం పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఆడమ్, పవన్ తమ జాతీయ పతాకాలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్, ఆడమ్ లు పోలండ్ విద్యార్థులు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత దేశం సంస్కృతి, విద్యావిధానాన్ని అధ్యయనం చేసేందుకు వచ్చిన విదేశీ విద్యార్థి బృందాన్ని పవన్ అభినందించారు. తన భార్య అన్నా రష్యా దేశస్తురాలన్న సంగతిని పవన్ గుర్తు చేశారు. ఆడమ్ కోరిక మేరకు పోలెండ్‌లో తెలుగు చిత్రాల చిత్రీకరణ చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. పోలెండ్‌లో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయని, అవి భారతీయ సినిమా షూటింగ్‌లకు అనుకూలంగా ఉంటాయని ఆడమ్ ఈ సందర్భంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ దంపతులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ రావడం తనకెంతో ఆనందం కలిగించిందని పేర్కొన్నారు.

చిత్రం..పవన్ కళ్యాణ్.. దర్శించుకోనున్న కొండగట్టు ఆంజనేయస్వామి