రాష్ట్రీయం

పనిచేస్తే మనకే పట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 21: ‘మన పనితీరు బాగుంటే ఎన్నిసార్లయినా ఎన్నుకోడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గతంలో మనం రెండుసార్లు అధికారంలో ఉన్నాం. మళ్లీ గెలిచాం. ప్రజలకు చేరువయ్యాం. జవాబుదారీతనంతో వ్యవహరిస్తే మనల్ని ఎవరూ ఓడించలేరు’అని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకుండా ప్రజల్లో నమ్మకం పెంచుకోవాలని, తద్వారా 2019 ఎన్నికల్లో 175 శాసనసభ, 25 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వపరంగా గడిచిన మూడున్నరేళ్లలో చేసిన పనులన్నీ ప్రజలకు వివరించాలని, పోలవరం ప్రాజెక్టుతో రాష్ట్ర ముఖచిత్రం మారనుందని చెప్పారు. విభజన చట్టంలోని అన్ని అంశాలు సాధించుకుందామన్నారు. ప్రధానంగా ప్రతిపక్ష, ఇతర చిన్న పార్టీల కుట్రలను దాటుకుని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను పార్టీ వైపు తిప్పుకోవాలని పిలుపిచ్చారు. దళితులను దరిచేర్చుకోవడమే లక్ష్యంగా పార్టీ ముందుకెళ్లాలని సూచించడం ద్వారా పార్టీ శ్రేణులను వచ్చే ఎన్నికలకు అధినేత సమాయత్తపరిచారు. రానున్న మూడు, నాలుగు నెలల్లో రాజకీయ లబ్ధికి నాంది పలకాలని పిలుపునిచ్చారు. ఉండవల్లిలోని తన నివాసం వద్ద గ్రీవెన్స్ సెల్ భవనంలో ఆదివారం జరిగిన పార్టీ వర్క్‌షాప్‌లో 13 జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో గడిచిన మూడున్నరేళ్ల కాలం సంతృప్తినిచ్చిందని, రాష్ట్ర విభజనను సవాల్‌గా తీసుకుని పనిచేశామన్నారు. గతంలోకన్నా ఇప్పుడు ప్రజల్లో చాలా మార్పు వచ్చిందన్నారు. దక్షణ భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిలో ముందున్నా తలసరి ఆదాయంలో మాత్రం వెనుకబడి ఉందన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ సర్వనాశనమైందన్నారు. విభజన చట్టంలోని
న్యాయమైన కోర్కెలు అమలు జరగాల్సి ఉందని ప్రధాని మోదీకి వివరించానన్నారు. గడిచిన మూడున్నరేళ్లలో ప్రభుత్వపరంగా పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం విజయవంతం అయిందన్నారు. రాష్ట్రంలోని కోటీ 38లక్షల 67వేల 769 ఇళ్లకు గాను కోటీ 35లక్షల 37వేల 125 అంటే 95.45 శాతం ఇళ్లవాసులను కలవటం శుభపరిణామమన్నారు. జవాబుదారీతనంతో బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ప్రజలతో మమేకం కావాలని ఉద్బోధించారు. తన హయాంలో ఇప్పటివరకు 23 జన్మభూమి కార్యక్రమాలు నిర్వహించగా సమైక్యాంధ్రాలో 18, నవ్యాంధ్రాలో ఐదుసార్లు జన్మభూమి సభలు జరుపుకున్నామని చెప్పారు. ఒకప్పుడు అధికారులను మందలిస్తే ప్రజలు చప్పట్లు కొట్టారుగాని ఓట్లు వేయలేదని, ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు మార్పుచెంది ప్రణాళికాబద్ధంగా ప్రజలను మెప్పించే స్థితికి చేరుకున్నామన్నారు. అత్యంత ప్రధానమైన పోలవరం విషయానికొస్తే 2019 నాటికి పూర్తిచేయాలనేది తన దృఢ సంకల్పంగా చెప్పారు. దీన్ని అడ్డుకునేందుకు అన్నివిధాలా ప్రయత్నాలు చేస్తున్నవారి కుట్రలు ఏమాత్రం పనిచేయవని, నదుల అనుసంధానం ద్వారా నీటి ఎద్దడి లేకుండా ఉండాలనేదే తన ప్రగాఢ విశ్వాసమని ఉద్ఘాటించారు. రానున్న మూడేళ్లలో 22వేల కోట్లతో ప్రతి ఇంటికీ నాణ్యమైన తాగునీరు ఇవ్వడమే లక్ష్యమన్నారు. ఇప్పటికే విద్యుత్ భద్రత కలిగించామని, ఇక చార్జీలు పెంచేదీ లేదని వందశాతం హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో దళితులను పార్టీ వైపు తిప్పుకునేందుకు ఎమ్మెల్యేలు కృషి చేయాలని, కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రతిపక్ష పార్టీ ప్రయత్నాలను సాగనివ్వరాదని సూచించారు. అగ్రకులాల్లోని పేదలను కూడా ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలనే ఆలోచన ఉందన్నారు. ఇదిలావుండగా కోడి పందేలు, జూదంపై అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు రాష్ట్రానికి వ్యవసనాలు పట్టరాదని, సంస్కృతి, సంప్రదాయాల ముసుగులో జూదాలను ప్రోత్సహించరాదని తేల్చిచెప్పారు. హైదరాబాద్ వంటి నగరాలకు డబ్బు వచ్చాక పబ్బులు వచ్చాయని, ఆపై డ్రగ్స్ సంస్కృతి ప్రవేశించిందని, అది ఏమాత్రం మంచిది కాదని ఉదహరించారు. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న నేరాలను నియంత్రించాలని, టెక్నాలజీ, సీసీ కెమెరాలు సత్ఫలితాలిస్తున్నాయని, ఈ దిశగా పోలీసు శాఖను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఉదహరించారు. వచ్చే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో ఇప్పుడున్న 63శాతం నుంచి మరో 5శాతం ప్రజల్లో సానుకూలత పెంచేందుకు, రాజకీయ లబ్ధి చేకూరేందుకు కృషి చేయాలని గడువు విధిస్తూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ శ్రేణులకు అధినేత దిశానిర్దేశం చేశారు. అనంతరం జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో సాయంత్రం వరకు పార్టీ స్థితిగతులపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

చిత్రం..టీడీపీ వర్క్‌షాప్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు