రాష్ట్రీయం

స్వార్థంతోనే హోదా తాకట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, జనవరి 21: తన స్వార్ధం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టారని వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజా సంకల్పయాత్ర 67వ రోజైన ఆదివారం శ్రీకాళహస్తి పట్టణంలో బహిరంగ సభ జరిగింది. పట్టణంలోని పెళ్లిమండపం వద్ద స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన ఈ వేదికపైకి స్థానిక నాయకులు, ప్రజలు రావడంతో అది కూలిపోయింది. ఈ సంఘటనలో 24మంది గాయపడ్డారు. ప్రత్యేక రథంపై నుంచే మాట్లాడిన జగన్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన పథకాలన్నీ ఇప్పటికీ అసంపూర్ణంగా ఉన్నాయని, వాటిని పూర్తిచేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన
తరువాత ప్రత్యేక హోదా కావాల్సి వుండగా ముఖ్యమంత్రి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద బాబు తాకట్టు పెట్టారని జగన్ ఆరోపించారు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయకుంటే సుప్రీంకోర్టుకు వెళతామని ముఖ్యమంత్రి చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీకి చెందిన ఎంపీలు మంత్రి పదవుల్లో ఉన్నారని అటువంటప్పుడు ఎవరిపై కోర్టుకు వెళతారని ఆయన ప్రశ్నించారు. ప్రజలను మోసం చేయడానికే తప్ప రాష్ట్భ్రావృద్ధికి ముఖ్యమంత్రి ప్రయత్నించడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన సందర్భంగా ఆడియో, వీడియో ద్వారా సిఎం దొరికిపోయారని అందువల్లే కేంద్రానికి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. గోదావరి పుష్కరాల సందర్భంగా 29 మంది దుర్మరణం చెందితే విచారణ కూడా జరపలేదని, సినిమా షూటింగ్‌ల కోసం ప్రజలను బలి చేశారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాల వారిని మోసం చేసిందని ఎవరికీ న్యాయం చేయలేదని ఆయన విమర్శించారు. సహకార రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేశారని సొంత డెయిరీ హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీని మూసివేయించారని ఆరోపించారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కేంద్రంతో పోరాడి తీసుకువచ్చిన మన్నవరం ప్రాజెక్టును రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. రూ. 6వేల కోట్లు పెట్టుబడితో 6వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించే ప్రాజెక్టు గురించి పట్టించుకోవడం లేదన్నారు. దీనివల్ల పరోక్షంగా మరో 5 వేల మందికి ఉపాధి లభిస్తుందని స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి వీలవుతుందన్నారు. సోమశిల-స్వర్ణముఖి కాలువను రాజశేఖర్ రెడ్డి హయాంలో 70 శాతం పూర్తిచేశారని మిగిలిన 30 శాతం పనులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అలాగే హంద్రీ-నీవా, సుజల-స్రవంతి పథకం పనులు కేవలం 20 శాతం మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని వాటిని పూర్తిచేస్తే పడమటి మండలాలకు తాగు, సాగునీరు వస్తుందన్నారు. అయితే కేవలం అబద్దాలతో ప్రచారం చేసుకుంటున్నారే తప్ప ప్రజలకు పనికి వచ్చే పనులను మాత్రం చేయడం లేదన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కొత్త పథకాలను తెరమీదకు తెస్తున్నారని ఆరోపించారు. ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం గురించి పూర్తి నిజాలు తెలుసుకోవాలని రానున్న ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే నవరత్న పథకాలను అమలు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు.

చిత్రం..శ్రీకాళహస్తిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి