రాష్ట్రీయం

బొక్కసానికి గండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిమ్మరాజు చలపతిరావు
విజయవాడ, జనవరి 21: ఆర్థిక సంస్కరణల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆంధ్రప్రదేశ్ ముందంజ వేస్తూ అనేకానేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సాధిస్తున్నా..నిధుల దుబారాను అరికట్టలేకపోతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల డ్రాయింగ్ అధికారులు, 13 జిల్లాల ఖజానా కార్యాలయాల అధికారులు కుమ్మక్కై ప్రభుత్వ బొక్కసానికి గండి కొడుతున్నారు. తమలో తాము లాలూచీ పడుతూ ఏనాడో కాలంచెల్లిన బ్రిటీష్ కాలం నాటి విధానాలను నేటికీ తు.చ.తప్పక పాటిస్తూ తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వందలు, వేల కోట్ల రూపాయల్లో నిధులు నేటికీ ఆయా ప్రభుత్వ శాఖల డ్రాయింగ్ అధికారుల బ్యాంక్ ఖాతాల పేరిటే జమ అవుతున్నాయి. నిబంధనల మేరకు ప్రైవేట్ వ్యక్తుల నుంచి అందుకునే సేవలు, అనేక రకాల కొనుగోళ్లకు సంబంధించి అన్నిరకాల బిల్లుల తనిఖీల అనంతరం నేరుగా ట్రెజరీల నుంచే సంబంధిత యజమానుల బ్యాంక్ ఖాతాలకే నిధులు జమకావాల్సి ఉంది. అయితే ఇక్కడ బిల్లుల ఆమోదం తర్వాత అటు ట్రెజరీ సిబ్బంది, ఇటు డ్రాయింగ్ అధికారులు కుమ్మక్కయి ఆ మొత్తాలను తమ బ్యాంక్ ఖాతాలకు జమ చేయించుకుంటున్నారు. ఆపై సంబంధిత వ్యక్తులు లేదా యజమానులను తమవద్దకు రప్పించుకుని కమీషన్లు పొంది తిరిగి చట్ట ప్రకారం వారి పేరిట చెక్కులు అందజేస్తున్నారు. ఒకవైపు ప్రధాని మోదీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు ఆర్థిక లావాదేవీల్లో మధ్యవర్తులు,
దళారుల ప్రమేయం వద్దేవద్దంటున్నారు. అయితే అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. ప్రధానంగా సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లు, దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో కనీసం 30వేల రూపాయల స్టేషనరీ, ఇతర ఫర్నిచర్ కొనుగోలుకు సంబంధించి డ్రాయింగ్ అధికారులు చట్ట విరుద్ధంగా ‘పెయిడ్ మీ’ పేరిట ట్రెజరీలకు బిల్లులు అందచేసి, సంబంధించి నగదు మొత్తాలను నేరుగా తమ బ్యాంక్ ఖాతాలకు జమ చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఏ ఒక్క ఉద్యోగి, అధికారి కూడా తన జేబుల నుంచి నయా పైసా కూడా చెల్లించకూడదు. అలా చెల్లిస్తే అది నేరం కూడా అని సీనియర్ అధికారులు చెబుతున్నారు. గతంలో డ్రాయింగ్ అధికారులు సమీప ట్రెజరీ కార్యాలయాల్లో నగదు తీసుకుని తమ పరిధిలోని ఉద్యోగులు, సిబ్బందికి పంపిణీ చేసేవారు. కొందరు కొంతకాలం ఆ నగదును వడ్డీలకు తిప్పుకోటం, లేదా తమ తమ స్వప్రయోజనాల కోసం వినియోగించుకోవటం జరిగేది. అయితే ఉద్యోగులు, సిబ్బంది నుంచి పాత తేదీలతోనే రశీదులు తీసుకునేవారు. ప్రస్తుతం ఈ పద్ధతి అమలులో లేదు. ఏకంగా ట్రెజరీల నుంచే ప్రభుత్వ, లేదా ప్రైవేటుగా సేవలందించిన సంస్థలు, వ్యక్తుల పేరిట నేరుగా సంబంధిత సొమ్ము జమకావాల్సి ఉంది. అయినప్పటికీ నేటికీ ఆయా శాఖల డ్రాయింగ్ అధికారుల ఖాతాల్లోకి నిధులు ఎందుకు జమ అవుతున్నాయో అంతుబట్టని స్థితి నెలకొని వుంది.