రాష్ట్రీయం

బ్యాలెట్‌తోనే నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: ‘బ్యాలెట్ పేపర్‌తోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి’ అని తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించేందుకే పంచాయతీలకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నదని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. పరోక్ష పద్ధతిలో ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయని ఆయన తెలిపారు. ఇప్పుడు నేరుగా సర్పంచులకు ఎన్నికలు నిర్వహిస్తే తమకు వ్యతిరేకంగా ఓట్లు వస్తాయన్న భయంతోనే పరోక్ష పద్ధతిన ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నదని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఎంపిటిసిల నుంచి మొదలుకుని ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, స్థానిక ప్రజాప్రతినిదుల వరకూ ఆకర్షించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిట్ట అని ఆయన విమర్శించారు. అందుకే సర్పంచ్‌ల ఎన్నికల్లో పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా తమకు దక్కని స్థానాల్లో వార్డు సభ్యులను ఆకర్షించి సర్పంచ్ పదవులను కైవసం చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారని ఆయన విమర్శించారు. రాజీవ్ గాంధీ 72వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు నిధులు, విధులు కల్పించారని ఆయన తెలిపారు. ఇప్పుడు ఆ స్పూర్తి దెబ్బతినేలా చేసి సర్పంచ్‌లకు అభద్రతా కల్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
పంచాయతీ ఎన్నికలను పరోక్ష పద్ధతిలో కాకుండా ప్రత్యక్ష (బ్యాలెట్) పద్ధతిలో నిర్వహించాలన్న ప్రధాన డిమాండ్‌తో పాటు ఈ నెల 23న గ్రామ పంచాయతీ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని, 27న గ్రామీణ, నియోజకవర్గ కేంద్రాల్లో రెవెన్యూ అధికారులను కలిసి వినతి పత్రాలు సమర్పిస్తామని, 30న జిల్లా కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించి కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.