రాష్ట్రీయం

గణతంత్ర పరేడ్‌లో ఖైదీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ జైళ్ల శాఖ డిజి వికె సింగ్ ఖైదీలను గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 26న చంచల్‌గూడ జైల్లో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఖైదీలు పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశారు. చంచల్‌గూడ, చర్లపల్లి, వరంగల్ ఓపెన్ జైళ్లలో ఉన్న 63 మంది ఖైదీలను పరేడ్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటికే చంచల్‌గూడ జైల్లో ఖైదీలకు ప్రత్యేక దుస్తుల్లో ఖైదీలకు రిహార్సల్ చేయిస్తుండగా, మిగిలిన రెండు జైళ్లలో కూడా అదే పద్దతిలో వారికి రిహార్సల్ ఇప్పిస్తున్నారు. ఒక ప్లాటూన్‌లో 21 మంది ఖైదీలతో కలిసి మూడు జైళ్ల నుంచి మూడు ప్లాటూన్లలో మొత్తం 63 మంది ఖైదీలు పరేడ్‌లో పాల్గొనబోతున్నారు. రెండు రోజులు ముందుగానే వీరిని ఫైనల్ రిహార్సల్ కోసం చంచల్‌గూడ జైలుకు తీసుకు రానున్నారు. లేత ఆకుపచ్చని యూనిఫాంతో పాటు బూట్లు, టోపి ధరించి ఖైదీలంతా పరేడ్‌లో పాల్గొంటారని జైళ్ల శాఖ చెబుతోంది. జైళ్ల శాఖ డిజి, కింది స్ధాయి ఐజి అధికారులు ఈ పరేడ్ రిహార్సల్‌ను పరిశీలించనున్నారు. గతంలోనూ రిపబ్లిక్‌డే, స్వాతంత్ర దినోత్సవంలో కొందరు ఖైదీలకు పరేడ్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు. చంచల్‌గూడ జైల్లో మాత్రమే ఆ అవకాశం కలిగించగా, ఇప్పుడు మిగిలిన జైళ్లలో ఉన్న వారిని సైతం కలుపుకుని పరేడ్‌లో వారికి భాగస్వామ్యం కలిగిస్తున్నారు.