రాష్ట్రీయం

రథసప్తమికి తిరుమలలో జోరుగా ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 21: ఈ నెల 24న సూర్య జయంతి సందర్భంగా తిరుమలలోని శ్రీ మలయప్ప స్వామివారు ఉదయం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు సప్తవాహనాలపై దర్శనమిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి ఆర్జిత సేవలు, విఐపి బ్రేక్ దర్శనం, వయోవృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. దివ్యదర్శనం టోకెన్లు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు యథావిధిగా ఉంటాయి. భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. వాహన సేవలను భక్తులు తిలకించేందుకు వీలుగా 19 ఎల్‌ఈడీ స్క్రీన్‌లు, ప్రత్యేకంగా పుష్పాలంకరణలు, 3 వేల మంది శ్రీవారి సేవకులు, 800 స్కౌట్స్ అండ్ గైడ్స్ భక్తులకు సేవలందించనున్నారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించేందుకు మాడవీధుల్లో సీనియర్ అధికారులను నియమించనున్నారు. సూర్యప్రభ వాహన సేవల్లో ఎస్వీ బాలమందిరం విద్యార్థులు ఆదిత్య హృదయం పారాయణం చేస్తారు. భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీలో వాహన సేవల ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే టీటీడీ విఐపి బ్రేక్ దర్శనాలను పరిమితం చేసింది.