రాష్ట్రీయం

ముగ్గురు మావోయిస్టు దళ సభ్యుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జనవరి 21: మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు దళ సభ్యులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా తెలిపారు. ఆదివారం ఇక్కడి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల నుంచి చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి మావోయిస్టులకు అవసరమైన సామగ్రి సరఫరా అవుతోందనే పక్కా సమాచారంతో వాహనాలు తనిఖీ చేశారు. ముగ్గురు దళ సభ్యులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. చర్ల మండల పరిధిలో మడివి సమ్మయ్య, ఓయం నందా, భద్రాచలం పట్టణం సమీపంలోని దేవనగరంలో మెరుగం అర్జున్‌లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరి నుంచి 130 డిటొనేటర్లు, 51 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకులు చంద్రన్న, ఆనందన్న, హరిభూషణ్‌తో నిందితులకు సంబంధాలున్నట్లు వెల్లడైందన్నారు. మావోయిస్టులకు సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంత జీవనం సాగించాలని కోరారు. అమాయకులను మావోయిస్టులు తమ అవసరాలకు వాడుకుంటున్నారని, దీనికి స్వస్తి పకాలని ఎస్పీ హితవు పలికారు. విలేఖరుల సమావేశంలో భద్రాచలం ఎఎస్పీ సునీల్‌దత్, కొత్తగూడెం డీఎస్పీ ఎస్‌ఎం అలీ, సీఆర్‌పీఎఫ్ కమాండెంట్ కెజి అహల్వర్ట్, ఎంటీవో సోములు, ఎస్‌బీ సీఐ సుబ్బారావు పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా