రాష్ట్రీయం

భద్రాద్రిలో భక్తరామదాసు వాగ్గేయకారోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, జనవరి 21: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం భక్తరామదాసు 385వ జయంతి సందర్భంగా వాగ్గేయకారోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన సంగీత కళాకారులు ఆలపించిన నవరత్న కీర్తనలు ఆద్యంతం అలరించాయి. ఆలయ ఈవో కె ప్రభాకర శ్రీనివాస్, శ్రీచక్ర సిమెంట్స్ అధినేత నేండ్రగంటి కృష్ణమోహన్ ఈ ఉత్సవాలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. రామదాసు వారసులు పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు రామదాసు జన్మ నక్షత్రం పేరుతో రామయ్య గర్భగుడిలో అభిషేకం నిర్వహించి రామదాసు చిత్రపటానికి స్వామివారి శేషమాలికలు, శేష వస్త్రాలు సమర్పించారు. గుడి ప్రాంగణంలోని రామదాసు విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేశారు. నగర సంకీర్తనతో రామదాసు భజన గీతాలు ఆలపిస్తూ గోదావరి తీరానికి చేరుకున్నారు. అక్కడ గోదావరి మాతకు పసుపు, కుంకుమ, పట్టువస్త్రాలు అందజేశారు. ఆద్యంతం భక్తిప్రపత్తులతో ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

చిత్రం..వాగ్గేయకారోత్సవాల్లో నవరత్న కీర్తనలు ఆలపిస్తున్న సంగీతకారులు