రాష్ట్రీయం

గిన్నీస్ రికార్డులు సృష్టించిన హిట్స్, గీతం విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: రెండు రెండు గిన్నీస్ రికార్డులను సృష్టించడం ద్వారా ప్రముఖ విద్యాసంస్థలు హోలీ మేరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (హిట్స్), గీతం యూనివర్శిటీలు మరో రికార్డును సృష్టించాయి. హోలీ మేరీ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్స్ కార్యదర్శి అరిమండ విజయశారదా రెడ్డి అత్యధిక మైండ్‌ఫైల్‌నెస్ లెసన్ ద్వారా సోమవారం నాడు రెండో పర్యాయం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సృష్టించారు. అనంతరం గిన్నీస్ ప్రతినిధి జయసింహ రికార్డు ధృవీకరణ చేశారు. విద్యార్ధుల్లో ఆలోచనలు, భావనలు, చర్యలు, ప్రేరణలను గుర్తించేందుకు నిర్వహించే మైండ్‌ఫుల్‌నెస్‌లో కార్యదర్శి ఎ విజయశారదారెడ్డి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారు. ఈ రికార్డుకు సంబంధించి విజయ శారదా రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత వేగవంతమైన ప్రపంచ తీరులో, అందునా ఇంటర్నెట్ యుగంలో మనుష్యులు ఇంటర్నెట్ చుట్టూ పరిభ్రమిస్తూ విలువైన సమయాన్ని అంతటినీ దానికే కేటాయిస్తున్నారని, ఆలోచన శక్తిని కోల్పోతున్నారని, తమ చుట్టూ జరిగే విషయాలను కూడా విస్మరిస్తున్నారని శాస్తవ్రేత్తలు గుర్తించారని చెప్పారు. ఇంటర్నెట్ యుగం ఫలితంగా మానవ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, పగ ధ్వేషం, అసూయ మానవ సంబంధాలను ధ్వంసం చేస్తున్నాయని, వీటి తీవ్రతను తగ్గించేందుకు , వీటన్నింటికీ దూరంగా ఉండేందుకు మైండ్‌ను పూర్తిగా నియంత్రణలో ఉంచేందుకు మైండ్‌ఫుల్ బ్రీతింగ్, మైండ్‌ఫుల్ అబ్జర్వేషన్, మైండ్‌ఫుల్ అవేర్‌నెస్, మైండ్‌ఫుల్ లిజనింగ్, మైండ్‌ఫుల్ ఇమ్మర్షన్ , మైండ్ ఫుల్ అప్రీసియేషన్‌కు దోహదకారి అవుతుందని అన్నారు. సమాజంలో ఒక నూతన ఒరవడి, కొత్త మార్పులను తీసుకువచ్చేందుకు సహాయంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్టు విజయ శారదారెడ్డి చెప్పారు. అనంతరం సంస్థ చైర్మన్ వరప్రసాదరెడ్డి ఆమెను అభినందించారు.
గీతం డీమ్డ్ వర్శిటీ బిటెక్ విద్యార్థిని శివాలీ మూడో గిన్నీస్ రికార్డును సృష్టించింది. హ్యాండ్ మేడ్ పేపర్‌తో రూపొందించిన 2111 విభిన్న బొమ్మలను ప్రదర్శినకు ఉంచి ఈ రికార్డును సృష్టించింది. ఇందుకు ఆమె తల్లిదండ్రులు కవిత, అనిల్ శ్రీవాస్తవ లు సహకరించారు. శివాలిని గీతం విసి ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ అభినందించారు.