రాష్ట్రీయం

ఎక్కడి నేతలు అక్కడే నిర్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం/కాకినాడ: కాపులను బిసిల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేసిన ముద్రగడ పద్మనాభం దంపతులను పరామర్శించేందుకు సోమవారం ఉదయం రాజమహేంద్రవరం చేరుకున్న నాయకులను పోలీసులు ఎక్కడికక్కడే నిర్బంధించారు. ముద్రగడను పరామర్శించేందుకు కిర్లంపూడి వెళ్లాలన్న ఉద్దేశ్యంతో రోడ్డు మార్గంలో తెల్లవారుజామున 5గంటలకే రాజమహేంద్రవరం చేరుకుని ఒక హోటల్‌లో బసచేసిన మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావును రాజమహేంద్రవరం పోలీసులు హోటల్ నిర్బంధంలో ఉంచారు. హోటల్‌లో విశ్రాంతి తీసుకున్న అనంతరం కిర్లంపూడి వెళ్లేందుకు బయలుదేరిన దాసరిని, హోటల్ నుండి బయటకు రావద్దని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో తీవ్ర నిరసన వ్యక్తంచేసిన దాసరి, తానొక్కడినే కిర్లంపూడి వెళతానని, తనను అనుమతించాలని డిమాండ్ చేశారు. అయినా సరే పోలీసులు మధ్యాహ్నం 2గంటల వరకు బయటకు రానీయలేదు. కిర్లంపూడిలో ముద్రగడ దీక్ష విరమించిన అనంతరం దాసరిని విడిచిపెట్టారు. ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 11.30గంటలకు విమానాశ్రయానికి చేరుకున్న పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డిని, మాజీ కేంద్రమంత్రి చిరంజీవిని విమానాశ్రయంలోనే రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీసులు అరెస్ట్‌చేసారు. విమానాశ్రయంలోకి విలేఖర్లను కూడా పోలీసులు అనుమతించలేదు. రాజమహేంద్రవరంలోనే మకాం చేసి ఉన్న శాసనమండలిలోని ప్రతిపక్ష నాయకుడు సి రామచంద్రయ్యను కూడా హోటల్ గదిలోనే నిర్బంధించాలని పోలీసులు భావించినప్పటికీ, విలేఖర్ల సమావేశం ముగించుకున్న వెంటనే పోలీసుల కళ్లుగప్పి వేరే మార్గంలో రామచంద్రయ్య విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే విమానాశ్రయం వద్ద పోలీసులు అడ్డుకుని, విమానాశ్రయం లోపలకు వెళ్లనీయలేదు. రామచంద్రయ్యతో పాటు మాజీ కేంద్రమంత్రి పల్లంరాజు, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ ఉన్నారు. కొద్దిసేపటి తరువాత వీరందర్నీ విమానాశ్రయంలోకి అనుమతించాల్సిందిగా పోలీసు బాసులు ఆదేశాలు జారీచేయటంతో దుర్గేష్ మినహా మిగిలిన ముగ్గురూ లోపలకు వెళ్లారు. బయటకు వెళ్లటానికి పోలీసులు ఎంతకూ అనుమతించకపోవటంతో చివరకు చిరంజీవి, రఘువీరారెడ్డి విమానాశ్రయం గేటు వద్దకు వచ్చి విలేఖర్లతో మాట్లాడి మళ్లీ లోపలకు వెళ్లిపోయారు.
అన్ని వర్గాల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రంలోని కాపులు సహా అన్ని వర్గాల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష విరమించిన అనంతరం ఆయన మరో నేత కిమిడి కళావెంకట్రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. కాపుల సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన కార్పొరేషన్‌కు మార్చిలోగా రూ.500 కోట్లు విడుదలచేస్తారని ప్రకటించారు. వచ్చే బడ్జెట్ నుంచి వెయ్యి కోట్ల కేటాయింపు జరుగుతుందన్నారు.