రాష్ట్రీయం

పెట్టుబడులే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: తెలంగాణను ప్రపంచ దేశాలకు పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు తెలిపారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలు దేశాల అధినేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సిఇవోలు, చైర్మన్లు సమావేశాలకు హాజరయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రారంభ ప్లీనరీ అనంతరం మంత్రి కేటీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోక్‌ష్, ఎంపీ గల్లా జయదేవ్, ముఖేష్ అంబానీ తదితర పారిశ్రామిక వేత్తలను కలిసారు. అదేవిధంగా మంత్రి కేటీఆర్ పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రధానంగా ఇండోరమా వెంచర్స్ చైర్మన్ అలోక్ లోహియాతో సమావేశమై తెలంగాణలో వ్యాపార లాభదాయక అంశాలపై చర్చించారు. థాయ్‌లాండ్‌కు ఈ గ్రూపు తెలంగాణలోని పెట్టుబడుల అవకాశాలను పరిశీలిస్తామని గ్రూపు చైర్మన్ అలోక్ లోహియా హామీ ఇచ్చారు. బ్యాంకాక్ నగరం కేంద్రంగా పని చేస్తున్న ఈ ఎంఎన్‌సి కంపెనీ టెక్స్‌టైల్ అనుబంధ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది. తెలంగాణలోని వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్కు దేశంలోనే అతి పెద్దదని, ఫ్యాబ్రిక్ టూ ఫైబర్ పద్ధతి పార్కుకు
ఉందని ఈ సందర్భంగా కేటీఆర్ చైర్మన్ అలోక్ లోహియాకు వివరించారు. ఇప్పటికే కొరియా నుంచి పార్కులో పెట్టుబడులు వస్తున్నాయని, ఇండోరమా కూడా పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని మంత్రి కేటీఆర్ కోరారు.
తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలిసారి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు రాష్ట్రానికి ఆహ్వానం లభించింది. ఐదు రోజుల సదస్సులో తెలంగాణ ప్రభుత్వ విధానాలు, రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమల స్థాపన, వ్యాపారాలకు అనుకూల అంశాలను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు వివరిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సదస్సులో 26న తన ప్రసంగం ఉందని, ఆ వేదికపై తెలంగాణను ప్రపంచ దేశాలకు పరిచయం చేసేందుకు కృషి చేస్తానని మంత్రి కేటీఆర్ ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు.

చిత్రం..ప్రపంచ ఆర్థిక ఫోరానికి హాజరైన అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ