రాష్ట్రీయం

పవన్‌తో భేటీకి నేతల ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 23: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కలిసేందుకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు సంబంధించి బుధవారం ఉదయం కొత్తగూడెంలోనూ, సాయంత్రం ఖమ్మంలోనూ ఆయనతో అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నారు. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు నేతలు ఆయనను కలిసి సంఘీభావం తెలపనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో జిల్లాలో పార్టీల పరిస్థితులు, తమ నేపథ్యం కూడా చెప్పనున్నారు. మరోవైపు కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పవన్‌కల్యాణ్ కార్యక్రమ ఏర్పాట్లను టీఆర్‌ఎస్‌కు చెందిన నేతలే చేస్తుండగా ఖమ్మంలో మాత్రం బహిరంగంగా బయటపడకుండా లోపాయికారిగా మద్దతిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా రెండుజిల్లాల పరిధిలో సుమారు 80కిలోమీటర్ల మేర బుధవారం పవన్‌కల్యాణ్ ర్యాలీ చేపట్టనుండగా ఇందుకు సంబంధించి ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాట్లను కూడా టిఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలే చేపడుతున్నారు. అయితే కొందరు ప్రధాన నేతలు తాము బయటపడకుండా తమ అనుచరులతో ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఏర్పాట్లను పర్యవేక్షించే నేత ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి అనుచరుడుగా ఉన్నాడు. అంతేకాకుండా పవన్‌కల్యాణ్‌ను కలిసేవారిలో ఆ పార్టీలకు చెందిన ప్రధాన నేతలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా పవన్‌కల్యాణ్ జిల్లా పర్యటన తరువాత రాజకీయ పరిస్థితిని అంచనా వేసి అవసరమైతే మరుసటి రోజున ఆయనను హైదరాబాద్‌లో కలిసేందుకు మరికొందరు నేతలు సిద్ధమవుతున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో చురుకుగా పాల్గొన్న నేతలతో పాటు ప్రస్తుతం అధికార టిఆర్‌ఎస్‌లో అసంతృప్తులుగా ఉన్న నేతలు కూడా ఈ జాబితాలో ఉన్నారు.