రాష్ట్రీయం

తిరుమలలో నేడు మినీ బ్రహ్మోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 23: కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరుడు కొలువైవున్న తిరుమల పుణ్యక్షేత్రంలో రథసప్తమి వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. సర్వసాధారణంగా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది రోజులు పాటు స్వామివారు రెండు పూటలా రోజుకు రెండు వాహనాలపై విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. అయితే రథసప్తమి నాడు ఒకే రోజు ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారు సప్త వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. అందుకే ఈ పర్వదినాన్ని భక్తులు మినీ బ్రహ్మోత్సవంగా భావించి ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి తరలివస్తారు. రథసప్తమి పర్వదినంలో స్వామివారిని తిలకించి తరించడానికి లక్ష మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఏర్పాటు చేస్తున్నారు. స్వామివారు ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి మాడవీధుల్లో ఊరేగడానికి బయలుదేరుతారు. ఉత్తర మాడ వీధికి చేరుకుని అక్కడ సూర్యదయం కోసం వేచివుంటారు. భాస్కరుని లేతకిరణాలు స్వామివారి పాదాల నుంచి ఆపాదమస్తకం స్పృశించగానే భక్తులు చేసే గోవిందనామ స్మరణల మధ్య అర్చకులు కర్పూర హారతులు పట్టడంతో వాహనం తూర్పు మాడ వీధి మీదుగా వాహన మండపానికి చేరుకుంటుంది. అనంతరం 9గంటలకు స్వామి, అమ్మవార్లు చిన్న శేష వాహనంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు గరుడ వాహనసేన, మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనంపైన విహరిస్తారు. అనంతరం 2 గంటలకు శ్రీవారి పుష్కరణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ చక్రస్నాన సమయంలో భక్తులు పుష్కరణిలో పుణ్యస్నానాలు ఆచరించి పునీతులు అవుతారు. సాయంత్రం 4 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామివారు కల్పవృక్ష వాహనంపైన, సాయంత్రం 6 గంటలకు సర్వభూపాల వాహనంపైన , రాత్రి 8 గంటలకు చందమామ వెనె్నల వెలుగులు, విద్యుత్ దీపాల మధ్య బంగారు, వజ్రాభరణాలు ధరించి విశేషాలంకారంతో దేదీప్యమానంగా వెలుగుతూ చతుర్మాడ వీధుల్లో స్వామివారు విహరిస్తారు. దీంతో రథసప్తమి వేడుకలు పరిసమాప్తమవుతాయి. ఈ రథసప్తమి వేడుకల్లో పాల్గొనేందుకు ఉదయం 4 గంటల నుంచే భక్తులు చతుర్మాడ వీధుల్లో వేచి ఉంటారు. అత్యధికశాతం మంది భక్తులు సప్త వాహనాలను తిలకించడానికి తాము కూర్చున్న గ్యాలరీల్లోనే నిరీక్షిస్తుంటారు. వీరికి అవసరమైన అన్నపానీయాలు, అల్పాహారాలు, పాలు, టీ, కాఫీలను నిరంతరాయంగా అందించేందుకు శ్రీవారి సేవకులు తమ సేవలను అందించేలా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈక్రమంలో మంగళవారం తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు, సీవీఎస్వో ఆకె రవికృష్ణ, వీజీఓ రవీంద్రారెడ్డి, సదాలక్ష్మి ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు.