రాష్ట్రీయం

ఎస్‌ఎస్‌సి, ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌పై ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోతే, విద్యా ప్రమాణాలు దిగజారుతాయని హైకోర్టు పేర్కొంది. ఇన్విజలేటర్లు మాస్ కాపీయింగ్‌ను నిరోధించని పక్షంలో క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఏలూరుకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ గుంటుపల్లి అనే వ్యక్తి దాఖలు చేసిన్ పిల్‌ను హైకోర్టు విచారించింది. ఈ పిల్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఎం గంగారావుతో కూడిన ధర్మాసనం విచారించింది. పిల్లల విజ్ఞానం పెరిగేందుకు అవకాశం ఇవ్వకుండా, ప్రాధాన్యత ఇవ్వకుండా, ఎక్కువ మార్కులను సాధించాలనే వత్తిడికి గురి చేస్తున్నారని హైకోర్టు పేర్కొంది. దీనివల్ల విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారని హైకోర్టు భావించింది. పరీక్ష కేంద్రాల్లో బాధ్యులైన ఇన్విజలేటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. మాస్ కాపీయింగ్‌ను నిరోధించని పక్షంలో డిఇవోలు, విద్యా శాఖకు చెందిన ప్రిన్సిపల్ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని, వారిని జవాబుదారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పరీక్ష కేంద్రంలో సిసి కెమెరాలు అమర్చుతున్నా, కాపీయింగ్ ఆగడంలేదన్నారు. కొన్ని ప్రైవేట్ స్కూళ్లు మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నాయన్నారు. అనంతరం ఈ కేసు విచారణను మూడు వారాల పాటు వాయిదావేశారు.