రాష్ట్రీయం

హీరో నానికి తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: టాలీవుడ్ హీరో నాని కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో వస్తుండగా కారు అదుపు తప్పి పక్కన ఉన్న డివైడర్‌ను, మధ్యలో ఉన్న విద్యుత్ స్ధంభాన్ని ఢీకొంది. ఈ సంఘటనలో కారు బెలూన్లు వెంటనే తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారులో ఉన్న నానికి స్వల్ప గాయం కాగా, డ్రైవర్‌కు ఏమీ కాలేదు. డ్రైవర్‌ను పోలీసులు బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించగా మద్యం సేవించలేదని తేలింది. కేవలం డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రోపర్టీ నష్టం కింద డ్రైవర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నాని షూటింగ్ ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత ఇంటికి ఫోన్ చేసి మరో కారు రప్పించుకుని, దానిలో ఇంటికి వెళ్లిపోయారు. ఈ సంఘటనపై నాని ట్విట్టర్ ద్వారా స్పందించారు. అభిమానులు ఆందోళన చెందవద్దని, స్వల్ప గా యం అయ్యింది తప్ప పెద్ద ప్రమాదం జరగలేదని ట్విట్టర్‌లో తెలిపారు. వారం రోజుల్లోగా మళ్లీ షూటింగ్‌కు వెళతానని పేర్కొన్నారు.