రాష్ట్రీయం

కోటప్పకొండలో శివాపచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 26: ఎంతో పవిత్రమైన హిందువుల ఆరాధ్యదైవం అయిన కోటప్పకొండలోని శివుని విగ్రహానికి అటు ఇటు క్రైస్తవ, ముస్లింల చిహ్నాలను ఏర్పాటుచేయడం మహాపచారం.. తక్షణం వాటిని తొలగించాలంటూ విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్‌భాయ్ తొగాడియా డిమాండ్ చేశారు. రెండురోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం నగరానికి చేరుకున్న తొగాడియా కానూరులో వెలగపూడి సాంబశివరావు నివాస గృహంలో రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. హిందువుల పవిత్ర క్షేత్రంలో నేడు క్రైస్తవ, ముస్లిం మతాల చిహ్నాలు ఏర్పాటుచేసి వాటి జోలికి ఎవరూ వెళ్లకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసారంటే రేపు ఆయా మతాల ప్రచారానికి కూడా అవకాశం కల్పిస్తారా యని ప్రశ్నించారు. కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవాలయం అతి పెద్ద శైవక్షేత్రమని, అక్కడకు లక్షలాది మంది హిందూ భక్తులు దర్శనానికి వస్తుంటారని అన్నారు. అలాంటి ప్రదేశంలో క్రైస్తవ, ముస్లింల చిహ్నాలు ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నిస్తూ అదేమంటే అది మతసామరస్యం అంటున్నారు... అదే సామరస్యంతో మసీదులు, చర్చిల్లో కూడా హిందువుల దేవుళ్ల ఫొటోలు పెట్టే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని ఆ చిహ్నాలను తొలగించని పక్షంలో హిందూ సమాజం నుంచి తీవ్రంగా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ తొగాడియా హెచ్చరించారు. ఈ సమస్యపై తాను స్వయంగా దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావుతో మాట్లాడుతున్నానని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే నేరుగా ముఖ్యమంత్రితోనే మాట్లాడతానని చెప్పారు. హిందూ దేవాలయాలపై ప్రభుత్వం పెత్తనం ఉండరాదని, అసలు ఒక్క హిందూ దేవాలయం మాత్రమే ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. హిందూ దేవాలయాలకు ఎంతో ఆదాయం వస్తున్నదంటూ వాటికి స్వేచ్ఛ నివ్వాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై ప్రశ్నించగా ఆయన పాలనకు రేటింగ్స్ ఇవ్వటానికి తానేమీ రాజకీయ నాయకుడిని కాదని నవ్వుతూ అన్నారు.
తనను ఎన్‌కౌంటర్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ గతంలో చేసిన వ్యాఖ్యలకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానంటూ రాజస్థాన్ హోంమంత్రి స్వయంగా తనపై కేసులు లేవని చెప్పారన్నారు. అయినప్పటికీ ఎక్కడో ఏదో జరుగుతున్నదని నర్మగర్భంగా చెబుతూ మిగిలిన వివరాలు త్వరలో ఢిల్లీలో వివరంగా చెబుతానని సమాధానమిచ్చారు. మోదీకి, తనకు మధ్య ఎలాంటి విభేదాల్లేవని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హైందవ సంస్కృతిపై జరిగే దాడిని అడ్డుకోవడంతోపాటు అయోధ్యలో రామాలయ నిర్మాణం తన ప్రధాన లక్ష్యంగా తొగాడియా స్పష్టం చేశారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని తక్షణం చేపట్టాలంటూ ఇక ఎంతకాలం రామభక్తులు ఎదురు చూస్తుంటారని ప్రశ్నించారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు విద్య, వైద్యం సదుపాయం కల్పించాలని రైతులకు ఉత్పత్తి వ్యయం కంటే ఒకటిన్నర రెట్లు ఆదాయం వచ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్న తొగాడియాకు ఘన స్వాగతం లభించింది. స్వాగతం పలికినవారిలో వీహెచ్‌పీ ప్రాంత అధ్యక్షుడు కళ్లం హరనాధరెడ్డి, ఉపాధ్యక్షుడు పీవీఎస్ నాయుడు, విజయవాడ నగర అధ్యక్ష, కార్యదర్శులు సాన శ్రీనివాస్, పెనె్మత్స రాఘవరాజు, వీహెచ్‌పీ, భజరంగ దళ్ ముఖ్యులు, తదితరులున్నారు.