ఆంధ్రప్రదేశ్‌

ముగిసిన ఐఎఫ్‌ఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: విశాఖలో నాలుగు రోజులపాటు జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మంగళవారం లాంఛనంగా ముగిసింది. వివిధ దేశాల నుంచి వచ్చిన యుద్ధనౌకలకు నౌకాదళ సంప్రదాయ రీతుల్లో వీడ్కోలు పలకడంతో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) ముగిసినట్టయింది. విశాఖ తీరానికి సుమారు 100 కిలో మీటర్ల దూరంలో ఈ వీడ్కోలు కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఉదయం 10 గంటల సమయంలో తూర్పు నౌకాదళ అధికారి సతీష్ సోనీ హెలికాప్టర్‌లో సుమిత్ర యుద్ధనౌకపై దిగారు. ఆరవ తేదీన జరిగిన ఫ్లీట్ రివ్యూలో రాష్టప్రతి ఈ నౌకపై నుంచే నౌకలను సమీక్షించిన విషయం తెలిసిందే. విదేశీ నౌకలకు వీడ్కోలు పలికేందుకు సిద్ధంగా ఉన్న భారత యుద్ధనౌకలను జెండా ఊపి సతీష్ సోనీ సముద్రంలోకి పంపించారు. ముందుగా సెయిలింగ్ నౌకలైన తరంగిణి, మదాయి, సుదర్శిని కొంత వరకూ ముందుకు సాగాయి. ఆ తరువాత యుద్ధ నౌకలన్నీ వరుసగా ఒకదాని వెంట బయల్దేరి సుమారు 92 కిలో మీటర్ల వరకూ ప్రయాణించాయి. అక్కడి నుంచి వెనక్కు తిరిగి వరుస క్రమంలో నెమ్మదిగా ముందుకు సాగాయి. అంతకు ముందే విశాఖ పోర్టు నుంచి బయల్దేరిన యుద్ధ నౌకలు తూర్పు వైపునకు సాగిపోయాయి. ఒక్కో నౌక భారత నౌకను దాటుతున్నప్పుడు, ఇందులోని సైలర్లు సెయిలింగ్ హ్యాట్ తీసి విదేశీ నౌకాదళ సిబ్బందికి బై..బై అంటూ నినాదాలూ చేస్తూ వీడ్కోలు పలికారు. కొన్ని నౌకల్లోని సిబ్బంది సాల్యూట్ చేశారు. మరికొంతమంది వారి సంప్రదాయ పద్ధతుల్లో ప్రతివాదం చేశారు. ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్న సుమారు 50 భారత యుద్ధ నౌకలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల 40 నిముషాలకు ఫ్లీట్ రివ్యూ ముగిసినట్టు నౌకాదళ అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా సతీష్ సోనీ మాట్లాడుతూ ఐఎఫ్‌ఆర్‌కు సహకరించిన అధికారులకు, నగర ప్రజలకు, మీడియాకు కృత్ఞతలు తెలియచేశారు. వివిధ దేశాల నుంచి నౌకాదళ అధికారులు ఇక్కడికి రావడం వలన, ఆలోచనలను పరస్పరం పంచుకోగలిగామని ఆయన అన్నారు. భారత నౌకాదళానికి విశాఖ హెడ్‌క్వార్టర్ అవుతుందని సోనీ గతంలో చెప్పిన మాటను విలేఖరులు ఈ సందర్భంగా ప్రస్తావించగా, తూర్పు తీరానికి తాను ఇచ్చిన గౌరవం అని అన్నారు. విరాట్‌ను ఈ సంవత్సరంలోనే డీకమిషన్ చేస్తామని, దీన్ని విశాఖలో ఎక్కడ ఉంచాలన్నది ఇంకా తేలలేదని సోనీ చెప్పారు.

చిత్రం.. విదేశీ యుద్ధనౌకలకు వీడ్కోలు పలికేందుకు వచ్చిన భారత యుద్ధనౌకలు వరుసగా వెళ్తున్న దృశ్యం