రాష్ట్రీయం

అన్ని అవతారాలకు భిన్నం నరసింహస్వామి స్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, జనవరి 27: అన్ని అవతారాలకు భిన్నమైనది నరసింహావతారమని, గొప్పనైన నరసింహ రూపం విష్ణు తత్వానికి యదార్థ స్వరూపమని ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వర్‌రావు ఉద్ఘాటించారు. శనివారం ధర్మపురి దేవస్థానంలో శేషప్ప కళావేదికపై నిర్వహించిన ఆధ్యాత్మిక ప్రచనంలో, విష్ణుతత్వం సర్వవ్యాపితమని, వ్యాపక నారాయణా స్థితం అన్న దానినే నరసింహావతార రూపంలో విష్ణువు చూపారన్నారు. విష్ణువుకు, నరసింహ అవతారం ఒక విషమ, అగ్ని పరీక్షగా మారిందని, అసలు విష్ణువే లేడని హిరణ్యకశిపుడంటే, జగద్రక్షకుడు సర్వాంతర్యామియని ప్రహ్లాదుడు నుడివాడని, బ్రహ్మ హిరణ్యకశిపునికి ఎక్కడలేని వరాలు ఒసంగారని, బ్రహ్మ వరం, భక్తుడైన ప్రహ్లాదుని విశ్వాసాన్ని, తన ఉనికిని యదార్థం చేయడానికి విష్ణువు వరం ప్రకారం అన్నింటి మినహాయింపుతో, సిద్దమైనారని, తన చూపుడు వేలితో చూపిన చోటే వైకుంఠ వాసిని చూపగలవా అంటూ హిరణ్య కశిపుడు ప్రశ్నిస్తే, అవునని ప్రహ్లాదుడు అంగీకరిస్తే, సమస్త బ్రహ్మాండాన్ని స్థూల రూపంలోకి తెచ్చి, నరసింహుడై స్థంభంలో ఉద్భవించి, వ్యక్తమైనారని వివరించారు. తండ్రికి శతృభావన, కుమారునికి మిత్ర భావన, అదే ప్రహ్లాదోపాఖ్యాన ప్రత్యేకమన్నారు. నారసింహుడు, ఉగ్రుడు కాదని, శాంతమూర్తియని, అయితే ఆయన ఉగ్రత్వం మూర్ఖత్వంపైనే ప్రదర్శితమన్నారు. సహస్ర ఫణీంద్రునికి కూడా ప్రహ్లాదుడిని వర్ణించడం సాధ్యంకాదని చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి, విశ్వాన్ని పూజామందిరం చేసి, దైవ సన్నిధిన సాయుజ్యం పోందాలని వివేకానందుడు, నవ్వగలిగిన ప్రాణి మానవవుడేనని జాషువా వ్యాఖ్యానాలను ఉటంకించారు. సకల చర్యలలో విష్ణువునే చూడడం, సర్వప్రాణుల ఎడ మిత్రభావం చూపడమే ప్రహ్లాదుడు గురుముఖతా గర్భస్థ శిశువుగా విన్నదే ఆచరించాడన్నారు. భీష్మఏకాదశి పర్వ దినాన నారసింహ దర్శన భాగ్యం పురాకృత సుకృత ఫలితమని, ధర్మపురి శేషప్ప విరచిత నరసింహ శతక పద్యం ఉదాహరించని తన ప్రవచనం ఉండదని స్పష్టం చేశారు. దేవస్థానం చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, ఇఓ సుప్రియ, ధర్మకర్తలు, అర్చకులు, వేదవిదులు, భక్తులు పాల్గొన్నారు.