రాష్ట్రీయం

‘కొండ’పై వాటిని కూల్చారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి/నరసరావుపేట, జనవరి 27: కోటప్పకొండపై అన్యమత చిహ్నాల అధికారులు కూల్చివేశారు. శైవక్షేత్రమైన గుంటూరు జిల్లా కోటప్పకొండ పైన ఉన్న పార్కులో నిర్మించిన శివుడి విగ్రహానికి అటు, ఇటు క్రైస్తవ-ముస్లిం చిహ్నాలు ఏర్పాటుచేసిన వైనంపై హిందు ధర్మసంస్థలు, పీఠాథిపతులు విరుచుకుపడిన విషయం తెలిసిందే. 31వ తేదీలోగా వాటిని తొలగించకపోతే తామే ధ్వంసం చేస్తామని శివస్వామి హెచ్చరించగా, వెంటనే తొలగించకపోతే సత్తా చూపిస్తామని వీహెచ్‌పీ నేత ప్రవీణ్ తొగాడియా హెచ్చరించిన ఒకరోజు తర్వాత ప్రభుత్వం హడావిడిగా నష్టనివారణకు రంగంలోకి దిగింది. శుక్రవారం రాత్రి ఎవరికీ తెలియకుండా ఆ చిహ్నాలను కూల్చివేసింది. అంతకంటే ముందు.. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు కొండపై అభివృద్ధి కార్యక్రమాలను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్న స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో శుక్రవారం సాయంత్రం ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. వాటిని తొలగించాల్సిన అవసరాన్ని మంత్రి కోడెల దృష్టికి తీసుకురాగా, అది దేవాలయ పరిధిలోకి రాదని, ఫారెస్టు పరిధిలో ఉన్న పార్కులో టూరిజం శాఖ దానిని ఏర్పాటుచేసి ఉంటుందని కోడెల మంత్రికి వివరించినట్లు తెలిసింది. అయితే ఏదేమైనా అదంతా ప్రభుత్వ అధీనంలోని ప్రాంతమే అయినందున, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూడటమే మంచిదని మంత్రి అభ్యర్ధించగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.