రాష్ట్రీయం

వైద్యరంగంపై పాలకుల నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 27: ఎంతో కీలకమైన వైద్యరంగం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుండటంతో దేశంలో పేద, మధ్యతరగతి వర్గాలు సరైన వైద్యంకోసం తమ తాహతుకు మించి ఖర్చు చేసి అప్పులపాలై వీధిన పడుతున్నారంటూ విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్‌భాయ్ తొగాడియా ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో పలువురు వైద్య ప్రముఖులతో సమావేశమయ్యారు. బడ్జెట్ కేటాయింపుల్లో వైద్యరంగానికి తగినంత ప్రాధాన్యత కన్పించడం లేదంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కేటాయింపులు అతి చిన్న బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల కంటే తక్కువగా ఉంటున్నాయని అన్నారు. దీన్నిబట్టి చూస్తే వైద్యం పట్ల కేంద్రం ఎంత శ్రద్ధ వహిస్తున్నదో ఇట్టే అర్థమవుతోందన్నారు. దేశ జనాభాలో పాతిక కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని వీరంతా తమ అరకొర ఆదాయం కనీసం 10 నుంచి 25 శాతం వైద్యం కోసమే ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. ద్రీనిని అధిగమించడానికి విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ‘ఇండియా హెల్త్ లైన్’’ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రైవేటు వ్యక్తుల సహకారంతో బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, బిఎంఐ వంటి పరీక్షలు సహా అన్నిరకాల వైద్య సేవలను ఉచితంగా అందించనున్నామన్నారు. 10 వేల మంది వైద్యులు , ఆరు వేల మంది వైద్య కార్యకర్తలు తాము చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారని అన్నారు. ప్రతి ఆదివారం వీరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఇదే సమయంలో మొబైల్ యాప్ ద్వారా 10 లక్షల మంది రక్తదాతలను ఇందులో భాగస్వాములను చేయనున్నామన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక వ్యాధులకు 234 బిలియన్ డాలర్లు భారత కరెన్సీలో రూ.14 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తున్నదన్నారు. అసలు వైద్యరంగం సంక్షోభానికి మెడికల్ కౌన్సిల్ ఇండియా (ఎమ్‌సీఐ) నిర్వాకమే కారణమన్నారు. బ్యూరోక్రాట్ల నియంత్రణలో ఈ సంస్థ పనిచేస్తున్నందున వైద్య రంగంలో ప్రస్తుతం సంబంధం లేని వ్యక్తులు తీసుకుంటున్న అస్తవ్యస్త నిర్ణయాలే దీనికంతటికి కారణమని తొగాడియా అన్నారు. ఈ సమావేశంలో వీహెచ్‌పీ ప్రాంతీయ కార్యదర్శి పీవీఎస్ నాయుడు, నగర అధ్యక్షు సానా శ్రీనివాసరావు, ఆంధ్రా ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ ఎం.రవీంద్రనాథ్, రాష్ట్ర మీడియా ఇన్‌ఛార్జి శివాజీ తదితరులు పాల్గొన్నారు.
దుర్గమ్మను దర్శించుకున్న తొగాడియా
విజయవాడ ( ఇంద్రకీలాద్రి): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శాంతి స్వరూపిణి, శ్రీకనకదుర్గమ్మను శనివారం విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్‌భాయ్ తొగాడియా దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించుకున్నారు. దుర్గగుడి ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యుడు వెలగపూడి శంకరబాబు, దేవస్థానం సహాయ ఈవో శ్రవణం అచ్యుతరామయ్య నాయుడు, తదితరులు అమ్మవారి రాజగోపురం వద్ద ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి దివ్య అశీస్సులను అందజేశారు. ఆలయాధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రత్యేక ప్రసాదాలను ఆయనకు అందచేశారు.
చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్‌భాయ్ తొగాడియా