ఆంధ్రప్రదేశ్‌

దిగజారిన ఆర్థిక పరిస్థితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ ఆర్ధిక పరిస్థితి దిగజారుతోంది. కేంద్రం సకాలంలో ఆదుకుంటుందున్న ఆశలు రోజురోజుకూ అడుగంటడంతో జీతాలకు సైతం వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది. తక్షణం నాలుగైదు వేల కోట్లను కేటాయిస్తే వాటిని ఏదో విధంగా సర్దుబాటు చేసుకుంటామనే ధోరణిలో రాష్ట్రం కేంద్రాన్ని కోరుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడం వల్ల కొత్త రాష్ట్రం ఎపిలో మొదటి 10 నెలలకు గానూ 16,079 కోట్లు లోటు ఏర్పడింది. 2014 జూన్ 2 నుండి 2015 మార్చి 31 వరకూ ఆర్ధిక లోటు 16,079 కోట్లుగా ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ ధృవీకరించినా అడ్‌హాక్ గ్రాంట్‌గా కేంద్ర ప్రభుత్వం ఇంత వరకూ 2,303 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. ఇంకా కేంద్రం 13,776 కోట్లు ఇవ్వాల్సి ఉంది. రాష్ట్రప్రభుత్వానికి ఇవ్వాల్సిన బకాయిలు దృష్టిలో ఉంచుకుని కేంద్ర బడ్జెట్‌ను రూపొందించుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రాలోని వెనుకబడిన ప్రాంతాల్లో భౌతిక, సాంఘిక వౌలిక వసతులు విస్తరణతో సహా అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాల్సి ఉందని కూడా సిఎం మంగళవారం నాడు ప్రధాని నరేంద్రమోదీని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన ప్రాంతాలకు కొరాపుట్ -బొలంగీర్-కలహండి ప్రత్యేక ప్యాకేజీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో ఉన్న బుందేల్‌ఖండ్ ప్రత్యేక ప్యాకేజీ తరహా అభివృద్ధి ప్యాకేజీని ఇవ్వాలని కూడా సిఎం కోరారు. కొత్తగా రాష్ట్రంలో అన్ని రకాలుగా వౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవల్సిన పరిస్థితుల్లో నిధులు పెద్ద ఎత్తున అవసరమవుతోందని రాష్ట్రం వాదిస్తోంది. పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు పన్నురాయితీలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావల్సిన ఆర్ధిక చర్యలను కూడా కేంద్రం తీసుకోనిదే పరిస్థితి మెరుగుపడదని ఆంఅధా వాదిస్తోంది. మేక్ ఇన్ ఇండియా కల సాకారం చేసేందుకు ఆంధ్రాలో పారిశ్రామికాభివృద్ధి అనుకూల వాతావరణం నెలకొనేందుకు లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలని రాష్ట్రం కోరుతోంది. అయితే కేంద్రం ఇప్పటికే అదనపు తరుగు రాయితీ 15 శాతం, అదనపు పెట్టుబడి రాయితీ 15 శాతం ఇచ్చింది. ఉత్తరాఖండ్ , హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు 100 శాతం సెన్‌వాట్ తో సహా పదేళ్లపాటు ఆదాయపు పన్ను, సేవా పన్నును మినహాయించారు. పారిశ్రామిక ఎస్టేట్‌లకు కేంద్రం నుండి 1500 కోట్ల రూపాయిలు వస్తుందని రాష్ట్రం ఆశిస్తోంది. విజయవాడ, గుంటూరు, అమరావతి గ్రీన్ ఫీల్డు క్యాపిటల్ సిటీ నిర్మాణానికి లక్షా 20 వేల కోట్లు అవుతుందని తాత్కాలిక అంచనా వేయగా కేంద్రం ఇంత వరకూ ఇచ్చింది మాత్రం కేవలం 1500 కోట్లు మాత్రమే. రాబోయే ఐదేళ్లలో రాజ్‌భవన్, సెక్రటేరియట్, హైకోర్టు, శాసనసభ, శాసనమండలి భవనాలతో సహా ముఖ్యమైన వౌలిక వసతుల కల్పనకు భూమి అభివృద్ధికి రాబోయే ఐదేళ్లలో 42,935 కోట్లు అవుతుందని రాష్ట్రం అంచనా వేసింది. విజయవాడ, అమరావతి, విశాఖలకు మెట్రో రైలు ప్రాజెక్టులకు, విశాఖ-చెన్నై నగరాలకు హైస్పీడ్ ట్రైన్‌కు నిధులు మంజూరు చేయడం తక్షణ కర్తవ్యంగా రాష్ట్రం కేంద్రాన్ని కోరుతోంది. విజయవాడ మెట్రోకు 4వేల కోట్లు ఇవ్వాలని కూడా రాష్ట్రం అభ్యర్ధించింది. మరో పక్క పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్రం 2014-15లో 1952 కోట్లు ఖర్చు చేయగా, 345 కోట్లు మాత్రమే రీయింబర్స్ చేశారు. మిగిలిన 1607 కోట్లను రీ యింబర్స్ చేయాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం మీద కేంద్రం 4092 కోట్లు రీయింబర్స్ చేయాల్సి ఉంటుందని రాష్ట్రం కోరుతోంది. 2014-15లో కేంద్రం పన్నుల్లో వాటాగా రాష్ట్రానికి 13,964 కోట్లు రాగా కేంద్ర సౌజన్య పథకాల కింద గ్రాంటుగా 11815 కోట్లు మొత్తం 25,507 కోట్లు వచ్చాయి. అలాగే 2015-16లో కేంద్ర నుండి 29,638 కోట్లు వచ్చాయి. మొత్తం మీద చూస్తే ఇదంతా 16 శాతం మాత్రమే. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు రాష్ట్రంపై ఇప్పటికే 2500 కోట్లు అదనపు భారం పడింది. గృహనిర్మాణ పథకం, ఉజ్వల్ డిస్కం అస్యూరెన్స్ యోజన అమలు తదితర సమస్యలు ఉండనే ఉన్నాయి.