రాష్ట్రీయం

క్లినికల్ శిక్షణకు మరింత పదును

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 27: జాతీయ వైద్యవిద్యా విధానంలో కీలక మార్పులు తీసుకురానున్నట్టు ప్రభుత్వ వైద్య విద్యా విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్, నీట్ పరీక్షల ప్రధాన అధికారి బీ శ్రీనివాస్ వెల్లడించారు. గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో విశాఖలో శనివారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. వైద్య విద్యా విధానంలో థియరీకంటే క్లినికల్ శిక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా భవిష్యత్‌లో సిలబస్ రూపొందించనున్నామన్నారు. యువతరం వైద్య విద్యను సామాజిక బాధ్యతగా చేపట్టాలన్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానే జాతీయ వైద్య మండలి ఏర్పాటుకు జరుగుతున్న సన్నాహాలను వివరించారు. ఏపీ వైద్య విద్యా విభాగం డైరెక్టర్ డాక్టర్ బాబ్జీ మాట్లాడుతూ చికిత్సలో ఆధునిక పరిణామాలను వివరించారు. వ్యాధి నిర్ధారణ, చికిత్సా విధానంలో సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతోందన్నారు. కార్యక్రమంలో గీతం డీమ్డ్ యూనివర్శిటీ వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎంఎస్ ప్రసాదరావు తదితరులు మాట్లాడారు.