రాష్ట్రీయం

రాష్టవ్య్రాప్తంగా జనహిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: ప్రజలకు చేరువయ్యేందుకు వినూత్న కార్యక్రమాలతో ముందంజలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం జనహిత అనే కొత్త ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో అమలు చేయనుంది. సాంకేతిక పరిజ్ఞానంతో జనహితను ప్రారంభించేందుకు అన్ని సన్నాహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని 31 జిల్లా కలెక్టరేట్లకు ప్రతి సోమవారం కలిసేందుకు పెద్ద సంఖ్యలో జనం వస్తుంటారు. తమసమస్యలను విన్నవించుకుంటారు. దీని వల్ల ప్రజలకు ఆర్థిక భారం, అధికారులు జనం ఎక్కువగా రావడం వల్ల సమస్యలను సావధానం వినలేకపోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్రప్రభుత్వం జనహిత అనే ప్రాజెక్టును మూడు జిల్లాలు సిద్ధిపేట, సూర్యాపేట, కామారెడ్డిలో అమలు చేసింది. ఎస్‌ఎంఎస్, వాట్సప్, ఇమెయిల్ లేదా కాల్‌సెంటర్ ద్వారా తమ సమస్యలను ప్రజలు నమోదుచేసుకోవాలి. ఈ ఫిర్యాదును ఇచ్చిన వెంటనే, ఫిర్యాదు చేసిన వారికి గ్రీవెన్స్ యూనిక్ నంబర్ (జియుఎన్) వస్తుంది. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆ నంబర్ ద్వారా ట్రాక్ చేయవచ్చును. అధికారులు తమకు వచ్చిన ఫిర్యాదును సంబంధిత శాఖకు బదలాయిస్తారు. అనంతరం ఈ ఫిర్యాదు లేదా సమస్యను ఉన్నతాధికారులు పర్యవేక్షించి త్వరితగతిన పరిష్కరిస్తారు. దీనికే జనహిత అని నామకరణం చేశారు. దీని వల్ల అధికారుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. అలాగే పరిపాలనలో పారదర్శకత పెరుగుతుంది. ప్రజలు, అధికారుల సమయం ఆదా అవుతుంది. దీనికి సంబంధించి జనహిత వెబ్‌సైట్‌ను రూపొందించారు. జనహిత వెబ్‌పోర్టల్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు విస్తరించే విధంగా టెక్నాలజీని ఐటి శాఖ అప్‌గ్రేడ్ చేస్తోంది. ఈ విభాగాన్ని ప్రతి జిల్లాలో జిల్లా రెవెన్యూ అధికారి పర్యవేక్షిస్తారు. త్వరితగతిన ఫిర్యాదులు, సమస్యలను పరిష్కరించే అధికారులకు ప్రోత్సాహకాలు ఇస్తారు. జవాబుదారీతనంతో వ్యవహరించని అధికారులను అప్రమత్తం చేస్తారు. మూడు జిల్లాల్లో అమలు చేసిన జనహిత వల్ల అద్భుతమైన స్పందన వచ్చిందని టెక్నాలజీ సర్వీసస్ లిమిటెడ్ అధికారులు తెలిపారు.
జనహితలో అనేక ఫీచర్లను కూడా పొంనదుపరిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జనహితను త్వరలో ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సమాచార టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ల శాఖ జనహితను పటిష్టంగా తయారు చేసేందుకు, సాంకేతిక పరంగా ఎటువంటి అవరోధాలు తలెత్తకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జనహితను తొలుత సూర్యాపేటలో గత ఏడాది జూన్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించి ఇతర రెండు జిల్లాలు కామారెడి, సిద్ధిపేటకు విస్తరించారు. రెండు నుంచి మూడు వారాల్లో జనహితకు వచ్చిన ఫిర్యాదులు, సమస్యలు పరిష్కారమైనట్లు, 70 శాతం మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేసినట్లు ప్రభుత్వం జనహితపై నిర్వహించిన ప్రాథమిక సర్వేలో వెల్లడైంది.