రాష్ట్రీయం

రూ.2.53 కోట్ల రద్దయిన నోట్లు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: పెద్దనోట్లు రద్దయి ఏడాది గడచిపోయినా ఇంకా వాటిని చలామణి చేసేందుకు కొన్ని ముఠాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆ ప్రయత్నంలో పోలీసులకు కొందరు చిక్కుతున్నారు. హైదరాబాద్ దక్షిణ మండలం పోలీసు పరిధిలోని బహదూర్‌పురా పోలీసులు ఏకంగా 2.53 కోట్ల రద్దయిన పెద్దనోట్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం నాడు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ వ్యాన్‌ను బహదూర్‌పురా క్రాస్ రోడ్ వద్ద తనిఖీ చేశారు. ఆ వాహనంలో ఉన్న నలుగురు పోలీసులను చూడగానే భయపడ్డారు. వాహనాన్ని తనిఖీ చేయడంతో రద్దయిన నోట్లు దర్శనమిచ్చాయి. వెయ్యి నోట్లు 21,546, 500 నోట్లు 7,508 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని కమీషన్ ప్రాతిపదికన కొత్త కరెన్సీగా మార్చుకునేందుకు ప్రణాళిక అమలు చేసే క్రమంలో పోలీసులకు నిందితులు చిక్కారు. నిందితులు పి.అమిత్ భగాడి, కె.మురారిలాల్, కాటారం రాజు, విష్ణు భాటిలను అరెస్టు చేసినట్లు డిసిపి తెలిపారు.