రాష్ట్రీయం

సూర్యారాధన సైనే్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 28: సూర్యారాధన ఒక మతానికి సంబంధించింది కాదని, సైంటిఫిక్ అంశమని సీఎం చంద్రబాబు అన్నారు. కులమతాలకు అతీతంగా సూర్యారాధన కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన సూర్యారాధనకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చరిత్రలో తొలిసారి ప్రభుత్వం తరపున ప్రకృతిని ఆరాధించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. సూర్యారాధనను మతాలు, కులాలకు అతీతంగా ప్రతిఒక్కరూ తమ జీవితాల్లో అలవాటు చేసుకోవటం వల్ల ఆరోగ్యవంతులై ఆసుపత్రులకు వెళ్లే అవసరం తప్పుతుందన్నారు. హిందూమతాన్ని అనుసరించి, బైబిల్, ఖురాన్‌ల ప్రకారమూ సూర్యారాధన వివిధ పద్ధతుల్లో ఎలా ఆచరిస్తారో మత పెద్దలు చెప్పి ఉన్నారన్నారు. ప్రతి మతంలో వివిధ పద్ధతుల్లో వివిధ రకాలుగా సూర్యారాధన జరుగుతుందని చంద్రబాబు వివరించారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాలు జరుపుకున్నట్టుగానే సూర్యారాధనను రాష్టస్థ్రాయి ఉత్సవంగా నిర్వహించేలా ప్రజలను భాగస్వాములను చేస్తున్నామన్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం చూస్తే అనాదిగా సూర్యారాధన చేయటంతోపాటు సూర్య దేవాలయాలను నిర్మించుకున్నామన్నారు. బైబిల్, ఖురాన్‌లలో సూర్యుడి గురించి ఏమని తెలియపరిచారో సీఎం చదివి వినిపించారు. ప్రపంచవ్యాప్తంగా సూర్యుడిని ప్రజలు వివిధ దేశాల్లో ఏయే పేర్లతో ఆరాధిస్తారో తెలిపారు. దేశంలో మన రాష్ట్రం తూర్పుకోస్తాకు మధ్యలో ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో మొదటిగా సూర్యుడు ఉదయిస్తాడని, తర్వాతనే ఇతర రాష్ట్రాల్లో సూర్యోదయం అవుతుందన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సన్‌రైజ్ ఏపీగా నామకరణం చేసి సూర్యభగవానుడిని బ్రాండ్ అంబాసిడర్‌గా చేసుకున్నామన్నారు. కొన్ని దేశాల్లో ఇప్పటికీ ప్రజలు ప్రకృతిని ఆరాధిస్తూ దాంతో మమేకం అవుతున్నారన్నారు. ఒక చైతన్య స్ఫూర్తిగా సూర్య భగవానుడు ప్రజలకు 24గంటలు ప్రపంచంలో ఏదో ఒక ప్రాంతానికి సూర్యశక్తిని అందిస్తూనే ఉంటాడన్నారు. సూర్య భగవానుడు క్రమశిక్షణకు మారుపేరని, ఆయన ఉదయించే సమయంలోనే కాలాన్ని లెక్కిస్తారన్నారు. ప్రజలకు క్రమశిక్షణ, చైతన్యం సూర్యునితోనే వస్తుందన్నారు. హిందువులు సూర్యుడికి మాఘ మాసంలో ప్రాముఖ్యం కల్పిస్తే క్రైస్తవులు డిసెంబరులో ప్రాముఖ్యమిస్తారన్నారు. రాష్ట్రంలో నీరు- ప్రగతి, జలసిరికి హారతి, ఏరువాక వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రజలకు నీటి ప్రాముఖ్యాన్ని తెలియజేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడేలా తీర్చిదిద్దామన్నారు. అమ్మకు వందనం కార్యక్రమం ద్వారా తల్లిని గౌరవించే కార్యక్రమానికి అంకురార్పణ
చేశామన్నారు. సూర్యుడిని నమ్ముకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు రావనే ఉద్దేశ్యంతో సన్‌గాడ్‌ను ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపట్టామన్నారు. సూర్యరశ్మితో హానికారక బ్యాక్టీరియా నశించిపోతాయని శాస్తజ్ఞ్రులు ప్రయోగాల ద్వారా నిరూపించారన్నారు. కొలస్ట్రాల్ తగ్గడం, బీపీ అదుపులో ఉండటం, డీ విటమిన్ లభించడం కూడా జరుగుతుందన్నారు. రోజూ ఉదయం పూట అర్ధగంట పాటు సూర్యరశ్మి శరీరంపై పడేలా ఉంటే రోగాల బారిన పడమని, పిల్లల్లో ఎదుగుదల బాగుంటుందన్నారు. సూర్యుడి నుండి వచ్చే ఎండ వల్ల సోలార్ విద్యుత్ లభించడంతో పాటు పర్యావరణానికి హాని కలిగించని సహాయం లభిస్తుందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ మూడున్నర సంవత్సరాల్లో 5వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు చెప్పారు. కర్నూలులోని ఓర్వకల్లులో సోలార్ పార్క్‌ను ప్రపంచంలోనే మొదటిదిగా వెయ్యి మెగావాట్లతో ఏర్పాటు చేశామన్నారు. గాలి మరల ద్వారా విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్రంలో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో 1997లో మొదటి దశ విద్యుత్ సంస్కరణలతో విద్యుత్ కొరతను తీర్చామన్నారు. రెండో దశలో విద్యుత్ చార్జీలు తగ్గించాలనే ముందస్తు ఆలోచనలతో పనిచేస్తున్నామని చంద్రబాబు వివరించారు. ముందుగా అన్ని మతాల పెద్దలతో సూర్యారాధనపై వారి ప్రవచనాలు, బైబిల్, ఖురాన్‌లలో చెప్పిన శాంతి సూక్తులను వినిపించారు. అనంతరం సూర్యారాధన కార్యక్రమానికి హాజరైన విద్యార్థులతో సూర్య నమస్కారం చేయించారు. కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్, శాసనమండలి విప్ బుద్దా వెంకన్న, ఎమ్మెల్సీ రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహనరావు, బొండా ఉమామహేశ్వరరావు, బోడే ప్రసాద్, జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం, తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..సూర్య నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు