రాష్ట్రీయం

విస్తరించనున్న కృష్ణా బోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: కృష్ణా బోర్డు విస్తరించనుంది. ఆంధ్ర, తెలంగాణలోని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలన్న ప్రతిపాదనలకు వేగం పెంచింది. వీటిపై నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో రెండు రాష్ట్రాల అధికారులతో చర్చించేందుకు వర్తమానం పంపింది. ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే కృష్ణా బోర్డు విస్తరిస్తోం ది. బోర్డు పరిధిలోకి ఇప్పటికే నిర్మాణమై ఉన్న ప్రాజెక్టులు, అనుమతులతో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు వస్తాయి. దీంతో ఈ ప్రాజెక్టు ల్లో పనిచేసే ఉద్యోగులంతా బోర్డు పరిధిలోకి
వస్తారు. వేతనాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లిస్తాయ. సమావేశంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను సేకరించి కేంద జలవనరుల మంత్రిత్వ శాఖకు పంపుతారు. కేంద్రం ఆమోదించిన తర్వాతనే బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు వస్తాయి. ఒకవేళ కృష్ణాబోర్డు ప్రతిపాదనలకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలియచేస్తే బోర్డు పరిధిని విస్తృతం చేస్తారు. బోర్డు ఏర్పాటు చేసే కమిటీలో బోర్టు కార్యదర్శి, రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఇరిగేషన్ శాఖ కార్యదర్శులు, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్‌లు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలో నీటి కేటాయింపులు, నీటి పంపకాలపై పరిష్కారం లభించనప్పుడు ఎపెక్స్ కమిటీకి నివేదిస్తారు. ఎపెక్స్ కమిటీలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ మంత్రి, కార్యదర్శి ఉంటారు.
కృష్ణా బేసిన్‌లో శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజిలు పూర్తి స్థాయిలో నిర్మాణమైన ప్రాజెక్టులు. ఇక వివిధ దశల్లో ఇంకా నిర్మాణంలో ఉన్న హంద్రీ- నీవా, గాలేరు-నగరి, వెలిగొండ, తెలుగుగంగ, తెలంగాంలో కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను ఆయా రాష్ట్రప్రభుత్వాలు పూర్తి చేసుకోవచ్చును. కాని కొత్తగా నిర్మించే ప్రాజెక్టులకు మాత్రం కృష్ణాబోర్డు అనుమతి అవసరమవుతుంది. ప్రస్తుతం తమకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని, రాష్టవ్రిభజన జరిగిందని, తెలంగాణ రాష్ట్రానికి తాజాగా నీటి కేటాయింపులు చేయాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వద్ద తన వాదనలు వినిపించింది. ఈ ట్రిబ్యునల్ తుది కేటాయింపులు ఇంకా చేయలేదు. ఈ ట్రిబ్యునల్ కేటాయింపులు చేసే వరకు ప్రస్తుతం అమలులో ఉన్న ఆంధ్రకు 512 టిఎంసి, తెలంగాణకు 299 టిఎంసి నిష్పత్తి ప్రకారం లభ్యతలో ఉన్న జలాలను రెండు రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంటుంది.
కానితెలంగాణ రాష్ట్రం మాత్రం బోర్డు ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. పట్టిసీమ ద్వారా దాదాపు50 నుంచి వంద టిఎంసి జలాలను కృష్ణా నదిలోకి ఆంధ్రప్రభుత్వం మళ్లిస్తోంది. గోదావరి జలాల ఒప్పందం మేరకు తమకు ఆ మేరకు నాగార్జునసాగర్‌లో అదనంగా జలాలను వాడుకునే హక్కు ఉందని, ఈ హక్కును తక్షణమే అమలు చేయాలని తెలంగాణ కోరుతోంది. దీనిపై కేంద్రం ఆశించిన రీతిలో స్పందించడంలేదని మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. పోతిరెడ్డి పాడు ద్వారా నిర్దేశించిన దాని కంటే ఎక్కువనీటిని ఆంధ్ర వాడుకుంటోందని, ఈ విషయంలో కృష్ణాబోర్డు విఫలమైందని తెలంగాణ వాదన. కాగా తెలంగాణ కూడా గోదావరి బేసిన్ నుంచి కృష్ణాబేసిన్‌కు కాళేశ్వరం ద్వారా నీటిని మళ్లిస్తోందని, ఇది సమ్మతం కాదని ఏపి వాదిస్తోంది. శ్రీశైలం వద్ద జల విద్యుత్ పేరిట నీటిని దిగువకు విడుదల చేస్తోందని ఏపి అభ్యంతరం తెలియచేసింది. శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం మెయింటైన్ చేయాలని బోర్డు చేసిన ఆదేశాలను ఏపి ప్రభుత్వం పట్టించుకోలేదని బోర్డుకు అనేక సార్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ నిర్మించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులు లేవని ఏపి ప్రభుత్వం అంటోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలశయాల్లో లభ్యతలో ఉన్న నీటిని సామరస్యంగా పంచుకుని వినియోగించుకోవడంలో ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కొరవడిన విషయం విదితమే. బోర్డు పరిధిలోనికి ప్రాజెక్టులు రావాలని మొదటి నుంచి ఏపి కోరుతోంది. ఈ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం అంత సులువుగా అంగీకరించే పరిస్థితి కనపడడం లేదు.