రాష్ట్రీయం

విషం చిమ్మితే వేటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: దేశంలో మతవిద్వేషాలు, వర్గాలపోరు ప్రేరేపించడం, అశ్లీల సాహిత్యాన్ని ప్రచారం చేసే సామాజిక మాధ్యమాలపై కేంద్ర హోంశాఖ వేటు వేస్తోంది. అభ్యంతరమైన రాతలను సామాజిక మాధ్యమాలపై ప్రచారం చేసే 1329 యుఆర్‌ఎల్ (యూనిఫైడ్ రిసోర్చ్ లోకేషన్)లను కేంద్రం 2017 సంవత్సరంలో బ్లాక్ చేసింది. 2016లో ఈ తరహా 964 సామాజిక మాధ్యమాలపై కొరడా ఝుళిపించింది. 2016తో పోల్చితే 38 శాతం ఎక్కువగా సమాజానికి, దేశానికి హాని చేసే సామాజిక మధ్యమాలను బ్లాక్ చేశారు. కేంద్రం వేటు వేసిన వాటిల్లో ట్విట్టర్లు, ఫేస్‌బుక్‌లు, యూట్యూబ్‌లు ఉన్నాయి. కేంద్ర పరిధిలో హోంశాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి శాఖలు విషప్రచారం చేసే సామాజిక మాధ్యమాలను బ్లాక్ చేస్తాయి. ప్రజలు అనేక సమస్యల పరిష్కారానికి, అభిప్రాయాలు తెలుసుకోవడానికి సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వాడుతుంటారు. కాని వీటిని దుర్వినియోగం చేసే వారి సంఖ్య పెరిగింది. కొన్ని వర్గాలు, సంస్థలు పుకార్లను వ్యాపింపచేస్తన్నాయి. అభ్యంతరకరమైన, వివాదస్పదమైన వ్యాఖ్యలను పోస్టు చేస్తున్నాయి. దీని వల్ల సమాజంలో సామరస్యత దెబ్బతిని అశాంతి నెలకొంటోంది. సైబర్ క్రిమినల్స్ వికృత చర్యలను అర్థం చేసుకునే స్థితిలో భారతీయ సమాజం చేరుకోలేదని, దీని వల్ల సామాజిక మాధ్యమాల్లో వచ్చే అంశాలునిజమని భ్రమిస్తున్నారని సైబర్ లా నిపుణులంటున్నారు. సమాజాన్ని తప్పుదోవబట్టించే సామాజిక మాధ్యమాలపై కేంద్రం దృష్టికి తీసుకువస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఆన్‌లైన్‌లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో పోస్టు చేస్తే సమాచార టెక్నాలజీ చట్టం 2000 కింద చర్యలు తీసుకుంటారు. సమాచార టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 ఏ కింద దేశ సౌర్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు యుఆర్‌ఎల్ సామాజిక మాధ్యమాలను బ్లాక్ చేసే అధికారాన్ని అధికారులు కలిగి ఉంటారు. ఐటి చట్టం 2000 పరిధిలో సెక్షన్ 79 (3) (బి) కింద అభ్యంతరమైన దృశ్యాలను తొలగించాలని అధికారులు సంబంధిత సంస్థలకు నోటీసులు కూడా ఇస్తారు. 2014లో 10 సామాజిక మాధ్యమాలు, 2015లో 587, 2016లో 964, 2017లో 1329 సామాజిక మాధ్యమాల యూఆర్‌ఎల్‌ను బ్లాక్ చేశారు. గత ఏడాది నవంబర్‌లోనే 588 యుఆర్‌ఎల్‌లను బ్లాక్ చేశారు. ఇందులో ట్విట్టర్‌లు ఎక్కువగా ఉన్నాయి.