రాష్ట్రీయం

తెరుచుకోనున్న గేట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: తెలంగాణ సర్కారు త్వరలో ఖాయిలా పడిన పరిశ్రమల పునరుద్ధరణకు ఇతోధికంగా నిధులు విడుదల చేయనుంది. పరిశ్రమల పునరుద్ధరణకు గతంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌లు చురుకుగా పనిచేసేందుకు మార్గదర్శకాలను విడుదల చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్న పరిశ్రమల యజమాన్యాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ఏడాది బడ్జెట్‌లో ఖాయిలా పడిన పరిశ్రమలను తెరిచేందుకు ప్రభుత్వం రూ.100 కోట్లను కేటాయించింది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి హెల్త్ క్లినిక్‌లు లేవు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఐటి పరిశ్రమల మంత్రి కేటీఆర్ హెల్త్ క్లినిక్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ పథకాన్ని గత బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో 15వేలకుపైగా చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయ. ఇవన్నీ ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నాయి. గత ఏడాది జూన్‌లో ప్రారంభించిన హెల్త్ క్లినిక్‌ల వల్ల తమకు ప్రయోజనం కలుగుతుందని ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం విడుదల చేసిన వంద కోట్ల రూపాయల నిధులు ఏమూలకు సరిపోవడం లేదు. ఖాయిలా పడిన పరిశ్రమలు గంపగుత్తగా దాదాపు రూ.19వేల కోట్ల వరకు బ్యాంకులకు బకాయిలను చెల్లించాల్సి ఉంది.
ప్రతి పరిశ్రమపైన రూ.4.5 లక్షల వరకు రుణభారం ఉంది. కాగా కొన్ని పరిశ్రమలు తమకు రూ. 5నుంచి రూ.20 లక్షల మేర నిధులిస్తే పరిశ్రమలను బతికించుకుంటామంటున్నారు. ఈ పథకం మూతపడిన పరిశ్రమలకు కల్పతరువు లాంటిదని చిన్న పరిశ్రమల సంఘం అధ్యక్షుడు ఏపికె రెడ్డి చెప్పారు. ఈ పరిశ్రమలు బతికితే 30వేల మంది కార్మికులు మళ్లీ ఉపాధి పొందుతారు. తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌ను రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద రిజిస్టర్ చేశారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్
కంపెనీగా దీనిని నమోదు చేశారు. చాలా పరిశ్రమలు మూతపడేందుకు సమైక్య పాలనలో ఏర్పడిన విద్యుత్ కొరతనే కారణమని పరిశ్రమల యాజమాన్యాలు అంటున్నాయి. ఇప్పుడు కరెంటు లభ్యత బాగుంది. కాని రుణ భారం పెరిగి పరిశ్రమలు మూతపడ్డాయంటున్నారు. 2008 నుంచి 2014 మధ్య విద్యుత్ కోతల వల్ల పవర్ హాలిడేలు ఇచ్చారు. కాని తెలంగాణ రాష్ట్రం అవతరించిన ఆరు నెలల నుంచి విద్యుత్ కొరతంటే తెలియకుండా ప్రభుత్వం సమగమైన ప్రణాళికను అమలు చేసింది. నిరర్ధక ఆస్తుల విలువ పెరగడంతో బ్యాంకులు చిన్న పరిశ్రమలను సీజ్ చేసింది. కాగా ఇటీవల రాష్ట్రప్రభుత్వ ఆదేశంతో పరిశ్రమల నిపుణులు హెల్త్ క్లినిక్ అధికారులతో కలిసి చిన్న పరిశ్రమల పునరుద్ధరణపై అధ్యయనం చేపట్టారు. వీరికి సబ్సిడీపై రుణాలు, మార్కెటింగ్ బ్రాండ్ మద్దతు ఇచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లకు మాత్రమే ప్రభుత్వ సహాయం అందుతుంది. ఎంపిక చేసిన మార్గదర్శకాలకు లోబడి ఉన్న చిన్న పరిశ్రమలకు మాత్రమే సహాయం అందే అవకాశం ఉంది. మూడు శాతం రుణంపై ఐదు లక్షల రూపాయల వరకు రుణాలు అందే అవకాశం ఉంది. ఆరు నెలల్లో ఈ పరిశ్రమలు ఈ సొమ్మును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. పునరుద్ధరించిన ఖాయిలా పరిశ్రమను కొత్త పరిశ్రమగా గుర్తించి విద్యుత్ సబ్సిడీలు, ప్రోత్సాహకాలను మూడేళ్లపాటు అందించే దిశగా ప్రభుత్వం ప్రణాళికను త్వరలో ఖరారు చేయనుంది.