రాష్ట్రీయం

హోదా సాధనలో వైఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, జనవరి 29: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనలో రాజకీయ పార్టీలు పూర్తిగా వైఫల్యం చెందాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. విభజనపై పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తపరచం ద్వారా సమష్టి పోరాటం చేయలేకపోయాయన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో సోమవారం జరిగిన పార్టీ జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశంలో పవన్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. యుపీఏ ప్రభుత్వం అస్తవ్యస్తంగా తెలుగు రాష్ట్రాలను విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తగిన న్యాయం జరగలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన రాజకీయపార్టీలు ఉన్నా న్యాయ పోరాటం చేయలేకపోయాయన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆ రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా సాధనలో ఇక్కడి రాజకీయ పార్టీల వైఫల్యం కొట్టిచ్చినట్టు కనిపించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో ప్రధాన పార్టీ ఒక్కో విధంగా వ్యవహరించడం వల్ల ప్రత్యేక హోదా డిమాండ్ నీరుగారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం ముందుగా ప్రత్యేక హోదా అని భరోసా ఇచ్చి ఆ తరువాత ప్రత్యేక ప్యాకేజీ
అంటూ మభ్యపెట్టడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా రాజకీయంగా పొత్తుపెట్టుకున్న భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూలంకుషంగా చర్చించి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీపై స్పష్టత ఇవ్వాలని తాను డిమాండ్ చేస్తున్నానన్నారు.
అధికారం, ముఖ్యమంత్రి పదవి కోసం జనసేన పార్టీని స్థాపించలేదని పవన్ కల్యాణ్ అన్నారు. వెనుకబాటుతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న రాయలసీమ వంటి ప్రాంతాలకు న్యాయం జరిగేదాకా జనసేన పోరాటం సాగిస్తూనే ఉంటుందన్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేన పార్టీ తప్పకుండా పోటీచేస్తుందని కార్యకర్తలు, అభిమానుల హర్షధ్వానాల మధ్య పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్నదానిపై ఇంకా ఆలోచించలేదన్నారు. జనసేన పార్టీ ఆశయాలకు అనుగుణంగా, తాము లేవనెత్తే ప్రజా సమస్యల పరిష్కారానికి కోసం ఏ పార్టీ ముందుకు వస్తుందో ఆ పార్టీతో పొత్తుపై అప్పుడు ఆలోచిస్తామన్నారు. ప్రజా సమస్యలపై ఓ సైనికుడు, ఓ వీరుడి తరహాలో జనసేన కార్యకర్తలు నిరంతరం పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. సరైన విధివిధానాలు, అకుంఠిత దీక్ష, నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేయకపోతే జనసేన పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లలో భాగస్వాములై సమస్యల పరిష్కారానికి జనసేన కార్యకర్తలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. సాగు, తాగునీరు కష్టాలతో అనంతపురం జిల్లావాసులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆకలి చావులు, అప్పుల బాధతో రైతులు ఆత్మహత్య చేసుకోవడం తనను తీవ్రంగా కలచి వేస్తున్నాయన్నారు. కష్టాలు వస్తుంటాయి తట్టుకోవాలన్నారు. తాను అందరికీ అండగా ఉంటానన్నారు. తనతో పాటు జనసేన శ్రేణులు సైనికుల్లా పోరాటం సాగించి సమస్యను పరిష్కరమయ్యేందుకు అంకితభావంతో పని చేస్తామన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనే రాజకీయాల్లోకి వచ్చామని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని ప్రజా పోరాటం సాగిస్తామని అన్నారు. పుట్టపర్తి సత్యసాయి మహాసమాధిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోమవారం దర్శించుకున్నారు. ఉదయం ప్రశాంతినిలయంలోని సత్యసాయి బాబా మహాసమాధినిపై పుష్పగుచ్ఛం ఉంచి ప్రణమిల్లారు. ఆయనకు సత్యసాయి ట్రస్టు సభ్యులు ఆర్‌జే.రత్నాకర్, ప్రసాదరావు తదితరులు సాదర స్వాగతం పలికారు.
చిత్రం..హిందూపురంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్