రాష్ట్రీయం

టీహబ్‌తో ఆర్‌ఈసీ ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: టిహబ్‌తో రూరల్ ఎలక్ట్ఫ్రికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఇసి) సోమవారం ఒప్పందం (ఎంఓయు) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 30 విశ్వవిద్యాలయాలకు చెందిన 1800 మంది విద్యార్థులు సోలార్ పవర్, విండ్ పవర్, బయో వేస్ట్ పవర్‌పై రీసెర్చ్ చేయడానికి అవకాశం కలిగింది. అలాగే ఈ విద్యార్థులు సుమారు 600 ప్రాజెక్టులపై పరిశోధనలు చేస్తారని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. టిహబ్‌లో సోమవారం ఇన్నోవేషన్ ప్లాట్ ఫామ్‌ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. అలాగే మంత్రి కెటిఆర్ సమక్షంలో టిహబ్‌తో ఆర్‌ఇసి ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, టిహబ్‌ను విశ్వవిద్యాలయాలకు సాంకేతికతను అనుసంధానం చేసి వినూత్న ప్రయోగాలకు నాంది పలుకుతామన్నారు. విశ్వవిద్యాలయాల్లో జరిగే పరిశోధనలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని మంత్రి అభిప్రాయపడ్డారు. టిహబ్, ఆర్‌ఇసిల ఒప్పందంలో భాగంగానే ఇన్నోవేషన్ ప్లాట్ ఫామ్‌ను ఏర్పాటు చేసామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎకో ఫ్రెండ్లీ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు పెరుగుతాయని, హరితహారం వల్ల పచ్చదనం పెరిగి వాతావరణ సమతూల్యత ఏర్పడుతుందన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని కెటిఆర్ అన్నారు.

చిత్రం..ఐటీ మంత్రి కేటీఆర్ సమక్షంలో టీహబ్‌తో ఆర్‌ఈసీకి కుదిరిన ఒప్పంద దృశ్యం