రాష్ట్రీయం

ఆన్‌లైన్‌లోనే బుకింగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: ఆన్‌లైన్‌లో మారణాయుధాలను కొనుగోలు చేసి ప్రజలను భయభ్రాంతులు చేసేందుకు పథకం వేసిన 12 మందిని నగర టాస్క్ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గృహాపకరణాల మాదిరిగా ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా ఈ ముఠా పదునైన మారణాయుధాలను, కొన్ని అతిపొడవైన, పదునైన నిషేధిత మారణాయుధాలను సైతం కొనుగోలు చేశారు. ఈ సంగతి టాస్క్ఫోర్స్‌కు సమాచారం అందడంతో దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ డిసిపి పి.రాధాకిషన్‌రావు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు. నిందితుల నుంచి 10 తల్వార్లు, 2 డాగ్గర్లు, ఒకటి పొడవాటి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ అదుపులోకి తీసుకున్న వారిలో సూద్ అమన్‌సింగ్, తుసమ్ కునాల్ సింగ్, సుధీర్ సింగ్, మహ్మద్ సల్మాన్, మహ్మ ద్ ముజీబ్, ముస్త్ఫా హుస్సేన్, బిసెంట్ శశికాంత్, మహ్మద్ యాసిన్ అహ్మద్, మహ్మద్ రవూఫ్, సల్మాన్ ఖాన్,
మహ్మద్ సిరాజుద్దీన్, మహ్మద్ సోహాలీలు ఉన్నట్లు డిసిపి తెలిపారు. స్నాప్‌డీల్ సర్వీస్ సంస్ధ ద్వారా మొదటి నలుగురు నిందితులు ఒక్కోక్క మారణాయుధాన్ని రూ.2000 నుంచి 2200 వరకు చెల్లించి రెండు నెలల కిందట కొనుగోలు చేశారు. వీటిలో కొన్ని ఎక్కువ పొడవు ఉండి, అతి పదునుగా ఉన్న కత్తులు నిషేధిత ఆయుధాల జాబితాలో ఉన్నాయని తెలిపారు. వీటి ద్వారా అక్రమాలు చేసేందుకు, ప్రజలను భయభ్రాంతులు చేసేందుకు వినియోగించాలని కొనుగోలు చేశారు. ఇలా మిగిలిన నిందితులు కూడా కొన్ని మారణాయుధాలను ఇటీవలే కొనుగోలు చేశారు. ఈ ఆయుధాలను ఫేస్‌బుక్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఫోటోలను పంపిస్తున్నారు. ఈ మేరకు అందిన సమాచారంతో దర్యాప్తు చేపట్టడంతో ఈ ఆన్‌లైన్ మార్కెటింగ్ వ్యవహారం వెలుగు చూసింది. నిందితులను, స్వాధీనం చేసుకున్న మారణాయుధాలను నిందితులు దొరికిన ప్రదేశాల్లో ఉన్న పోలీసు స్టేషన్లకు అప్పగించారు. ఇలాంటి నిషేధిత మారణాయుధాలను ఎవరూ కొనుగోలు చేయవద్దని, అది నేరమని డిసిపి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసును టాస్క్ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వరరావు, ఎస్‌ఐలు పి.చంద్రశేఖరరెడ్డి, బి.శ్రావణ్‌కుమార్, కె.శ్రీకాంత్ దర్యాప్తు చేశారు.

చిత్రం..మారణాయుధాలను స్వాధీనం చేసుకున్న టాస్క్ఫోర్స్