రాష్ట్రీయం

కలెక్టర్ అమ్రపాలికి సీఎస్ మందలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: గణతంత్ర దినోత్సవ వేదికపై వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి చేసిన ప్రసంగం నవ్వులపాలు కావడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ సోమవారం కలక్టర్ అమ్రపాలికి ఫోన్ చేసిన వివరణ కోరారు. కలక్టర్ హోదాలో ఉండే వ్యక్తి హుందగా వ్యవహరించాలని సిఎస్ హితవు పలికారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే తీవ్రంగా పరిగణించనున్నట్టు సిఎస్ మందలించినట్టు అధికార వర్గాల సమాచారం. ఇక ముందు ఎలాంటి పొరపాట్లు జరుగకుండా అప్రమత్తంగా ఉంటానని కలక్టర్ అమ్రపాలి హామీ ఇచ్చినట్టు సమాచారం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి కలక్టర్ ప్రసంగించారు. అయితే ఆ ప్రసంగం సందర్భంగా అమ్రపాలి మధ్య మధ్యలో నవ్వుతూ వెనక్కి తిరిగి చూడటంతో పాటు ప్రసంగం మధ్యంలో కొన్ని గణాంకాలు వెల్లడిస్తూ ‘ఇట్ ఫన్నీ’ అని వ్యాఖ్యానించారు. ఈ సంఘటన సామాజిక మాధ్యామాల్లో వైరల్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కలక్టర్ నుంచి వివరణ తీసుకోవాల్సిందిగా సిఎస్‌ను ప్రభుత్వం ఆదేశించడంతో ఫోన్లో వివరణ కోరినట్టు సమాచారం.