రాష్ట్రీయం

50 వేలు దాటితే ఈ-వే బిల్లు కావాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: యాభైవేలు, ఆపైగా విలువైన సరకులను రవాణా చేసేందుకు వ్యాపారులు తప్పనిసరిగా ఈ-వే బిల్లులను తీసుకోవాలని తెలంగాణ వాణిజ్య పన్నుల కమిషనర్ వి. అనిల్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈ నిబంధన 2018 ఫిబ్రవరి 1 నుండి అమల్లోకి వస్తుందన్నారు. ఈ నిబంధనను గుర్తించి సరకుల పంపిణీదారులు, రవాణాదారులు తమ పేర్లను, సరకుల రవాణాను వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఈ నిబంధనను అతిక్రమించిన వారిపై టిజిఎస్‌టి చట్టం 2017 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో జిఎస్‌టి చెల్లిస్తున్న వర్తక, వాణిజ్య వేత్తలంతా తమ క్లైంట్లలో చైతన్యం తీసుకురావాలని కమిషనర్ సూచించారు. ఎవరైనా అదనపుసమాచారం కావాలనుకుంటే సహాయ కేంద్రాన్ని 1800-425-3787 ఫోన్ నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు.