రాష్ట్రీయం

ఉద్యోగం పేరిట మోసగించిన కేసులో రైల్వే ఉద్యోగికి జైలు శిక్ష, జరిమాన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తానంటూ నమ్మ బలికి అమాయకులైన వారి నుంచి సొమ్ములు వసూలు చేసిన కేసులో నిందితుడికి జైలు శిక్ష, జరిమాన విధిస్తూ సిబిఐ కేసుల న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ సిబిఐ డిఐజి కార్యాలయం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
2013 మే 3న లాలాగూడలోని రైల్వే వాటర్ వర్క్స్‌లో పని చేస్తున్న ట్రైనీ ఫిట్టర్ కోటి స్టీఫెన్ ఆదిత్య రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఒకరి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా రైల్వే విజిలెన్స్ టీం డెకాయ్ ఆపరేన్ ద్వారా పట్టుకుంది. ఈ ఒక్క కేసులోనే కాకుండా ఇంకా చాలా మంది నుంచి ఇలా సొమ్ములు వసూలు చేసినట్లు కూడా విజిలెన్స్ గుర్తించింది. ఈ మేరకు విజిలెన్స్ నుంచి అందిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది. అనంతరం కోర్టులో విచారణ ముగియడంతో నిందితుడికి జైలు శిక్ష, జరిమాన విధించారు.