రాష్ట్రీయం

కోడి పందాల తీరుపై హైకోర్టు అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో కోడి పందేల నిర్వహణపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తాము ఆదేశాలు ఇచ్చినా, అడ్డుకోవడంలో అధికారం యంత్రాంగం విఫలమైందని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్, జస్టిస్ ఎం ఎస్ కె జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి దినేష్ కుమార్ సోమవారం నాడు వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరయ్యారు. డిజిపిల సదస్సులో ఉన్నందున డిజిపి మాలకొండయ్యకు వ్యక్తిగత హాజరు నుండి గతంలోనే మినహాయింపు లభించింది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోడి పందేలకు సంబంధించి ఎన్ని కేసులు నమోదయ్యాయో, నిందితులు ఎవరో, ఉభయ గోదావరి జిల్లాల్లో 806 చోట్ల జరిగిన కోడి పందాలను ఎవరెవరు నిర్వహించారో పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. వివరాలు సమర్పించడానికి కొంత సమయం కావాలని సిఎస్, డిజిపి కోరడంతో అందుకు ధర్మాసనం అంగీకరించింది. తదుపరి విచారణకు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని సిఎస్ కోరగా హైకోర్టు అనుమతించింది. గత ఏడాది పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందేలను అడ్డుకోవడంలో విఫలమైన తహసీల్దార్‌లు, ఎస్‌ఐలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని కోర్టు ఆదేశించింది. కోడి పందేల నిర్వహణలో ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరుపై ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. బహిరంగంగా పందేలను ప్రోత్సహిస్తున్నారని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.